Main Menu

మ‌హేష్ బాబు చేసిన నేరం ఏమిటి?

Spread the love

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఆర్థిక వ్య‌వ‌హారాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆయ‌న బ్యాంక్ అకౌంట్లు అటాచ్ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. బాబుకు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను తాజాగా జిఎస్‌టి అధికారులు సీజ్‌ చేశారు. వివిధ సంస్థలు, కంపెనీల కోసం నటించిన పలు ప్రకటనలు, ప్రమోషన్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహారించినందుకు ఆయనకు వచ్చిన ఆదాయంపై సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించలేదని హైదరాబాద్‌ జిఎస్‌టి కమిషనరేట్‌ తెలిపింది. 2007-08 ఆర్ధిక సంవత్సరానికి గాను సర్సీసు ట్యాక్స్‌ ఎగ్గొట్టారని ప్రధాన ఆరోపణ. ఈ సూపర్‌ స్టార్‌ గత తొమ్మిదేళ్లుగా ఈ పన్ను చెల్లించలేదు. దీంతో ఆయన బ్యాంకు ఖాతాలను ఆటాచ్‌ చేశారు. మహేష్‌కు చెందిన యాక్సిస్‌, ఐసిఐసిఐ బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. 2007-08లో మొత్తం రూ.18.5 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. పన్నులు, జరిమానా, వడ్డీతోసహా మొత్తం కలిపి ప్రస్తుతం రూ.73.5 లక్షలు చెల్లించాలని మహేష్‌కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ప‌న్నులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదంటూ మ‌హేష్ బాబు ట్రిబ్యున‌ల్ ని ఆశ్ర‌యించారు. అయినా ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. అనంత‌రం కోర్టుకెక్కినా కోరుకున్న ఫ‌లితం రాక‌పోవ‌డంతో మ‌హేష్ బాబు కి ఝ‌ల‌క్ త‌ప్ప‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న బ్యాంకు ఖాతాలో ఉన్న న‌గ‌దును స్వాధీనం చేసుకున్న‌ట్టు జీఎస్టీ అధికారులు ప్ర‌క‌టించారు. ఇదిప్పుడు టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.






Related News

మ‌హేష్ తో మువీ గురించి…!

Spread the loveదర్శకుడు అనిల్‌ రావిపూడి చెప్పేశారు. మహేశ్‌బాబుతోనే తన తదుపరి సినిమా అని. అయితే… ఈ విషయాన్ని నేరుగాRead More

ఉగాది నాడు మ‌హేశ్

Spread the loveసూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఉగాదికి వ‌స్తున్నాడు. అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టుగా మ‌హ‌ర్షి టీజ‌ర్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *