అత‌డితో మ‌ళ్లీ జ‌త‌గ‌డుతున్న మ‌హేష్

mahesh
Spread the love

ఒక‌సారి ఫ్లాఫ్ వ‌చ్చిన త‌ర్వాత మ‌ళ్లీ అదే కాంబినేష‌న్ చూడాలంటే చాలాకాలం ప‌డుతుంది. ఫ్లాఫ్ డైరెక్ట‌ర్ల‌ను మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌కు చేర్చుకోవ‌డానికి చాలామంది హీరోలు స‌సేమీరా అంటారు. కానీ మ‌హేష్ బాబు దానికి భిన్నంగా సాగుతున్నట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే భ‌ర‌త్ అనే నేను సినిమాతో ఈనెల 20న బాక్సాఫీస్ ముందుకు వ‌స్తున్నాడు. ఆ త‌ర్వాత వంశీపైడిప‌ల్లి సినిమాకు సిద్దం అవుతున్నాడు.

అయితే మ‌హేష్ 26 మువీకి రంగస్థలంతో గ్రాండ్ స‌క్సెస్ కొట్టిన సుకుమార్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఇది సుకుమార్ కి బంప‌రాఫ‌ర్ గానే భావించాలి. ‘1 నేనొక్కడినే’ సినిమా తీవ్ర నిరాశ మిగిల్చింది. కమర్షియల్‌గా సక్సెస్ కాలేక‌పోయింది. అయినా సూపర్ టెక్నికల్ మూవీగా గుర్తింపు దక్కింది. దాంతోనే మ‌హేష్ కి సుకుమార్ మీద న‌మ్మ‌కం కొన‌సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో రంగ‌స్థ‌లం హిట్ కూడా సుకుమార్ కి తోడయ్యింది. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ మ‌రోసారి సుకుమార్ కి సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. సుకుమార్ క‌థ సిద్ధం చేయ‌డాన్ని బ‌ట్టి మ‌హేష్ 27వ సినిమా అయినా గానీ ఆ ద‌ర్శ‌కుడి చేతిలో సాగుతుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.






Related News

tollywood

చానెళ్ల‌కు చెక్ పెట్టాల‌ని హీరోల నిర్ణ‌యం!

Spread the loveటాలీవుడ్ టాప్ హీరోలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. న్యూస్ చానెళ్ల వ్య‌వ‌హారంతో తీవ్రంగా క‌ల‌త చెందుతున్న స్టార్లంతాRead More

mahesh babu

మ‌హేష్ ఫిక్స‌య్యాడు..

Spread the loveభ‌ర‌త్ అనే నేను విజ‌యంతో ఊపుమీద‌కొచ్చిన మ‌హేష్ బాబు త‌న నెక్ట్స్ మువీని క‌న్ఫ‌ర్మ్ చేశారు. మ‌హేష్Read More

  • శ్రీ రెడ్డి వివాదంలో మంచు విష్ణు ఎంట్రీ
  • బ‌హిరంగంగానే శృతిహాస‌న్…!
  • భ‌ర‌త్ అనే నేను మువీపై ఆస‌క్తిక‌ర రిపోర్ట్
  • శ్రీరెడ్డిపై కొరటాల శివ ఆవేద‌న‌
  • ఎన్టీఆర్ స్థానంలో నాని..
  • చిరంజీవి సైరాకి సై అంటున్న త‌మ‌న్న‌
  • జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ స‌త్తా
  • అత‌డితో మ‌ళ్లీ జ‌త‌గ‌డుతున్న మ‌హేష్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *