Main Menu

మే నెల‌లో మొద‌లు పెడుతున్న మ‌హేష్

Spread the love

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమా మ‌హ‌ర్షి ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. పూజాహెగ్డేతో క‌లిసి మ‌హేష్ న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇక మ‌హేష్ 26వ సినిమాని స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తో చేయ‌డానికి ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం వ‌చ్చే స‌మ్మ‌ర్ లో ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి చేసుకుని ఏప్రిల్ ఆఖ‌రి వారంలో ముహూర్తం పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మే నెల నుంచి మహేష్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారుజ‌

మహేష్ కాంబినేషన్‌లోని సీన్లను మేనుండి ఫారెన్ లొకేషన్స్‌లో షూట్ చేయనున్నారు. ఇక మహేష్‌బాబు సరసన రకుల్‌ప్రీత్ కథానాయికగా నటిస్తున్నట్లు వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌స్త‌తుం ఆ ప్ర‌తిపాద‌న వెన‌క్కిపోయిన‌ట్టు స‌మాచారం. హీరోయిన్ ని ఇంకా ఖ‌రారు చేయలేద‌ని యూనిట్ చెబుతోంది. రంగస్థలం సినిమాతో సూపర్ హిట్‌కొట్టి టాప్ డైరెక్టర్‌గా తన స్థానాన్ని సుస్థిరంచేసుకున్న సుకుమార్, అద్భుతమైన స్క్రిప్ట్‌ను తయారుచేశారట. సుకుమార్ చెప్పిన స్క్రిప్ట్ మహేష్‌బాబుకు కూడా బాగా నచ్చిందట. అందుకే వెంటనే ఈ సినిమా చెయ్యటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది..






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *