శ్రీరెడ్డి సాధించింది…

Daem2r5WAAAHXHA
Spread the love

టాలీవుడ్ సంచ‌ల‌నం శ్రీరెడ్డి పోరాటం ఫ‌లించింది. ఆమె ఉద్య‌మానికి ఫ‌లితం ద‌క్కింది. ఆమె డిమాండ్ కి మువీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ త‌లొగ్గింది. మా లో శ్రీరెడ్డి మీద విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా మా అధ్య‌క్షుడు శివాజీ రాజా ఈమేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. దాంతో శ్రీరెడ్డి ఆందోళ‌న‌కి మా దిగి వ‌చ్చిన‌ట్ట‌య్యింది.

ఇటీవ‌ల క్యాస్ట్ కౌచింగ్ పై శ్రీరెడ్డి సంచ‌ల‌నంగా మారింది. ఆమె న‌గ్నంగా నిర‌స‌న తెలప‌డానికి సిద్ధ‌ప‌డ‌డ‌మే కాకుండా, ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు త‌న‌యుడి ఫోటోల‌ను కూడా లీక్ చేసింది. దాంతో టాలీవుడ్ ఉలిక్కిప‌డింది. తొలుత ఆమె నిర‌స‌న‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయిన‌ప్ప‌టికీ , లీకుల కార‌ణంగా ప‌లువురి వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ‌బోతోంద‌నే ప్ర‌చారంతో వెన‌క్కి త‌గ్గింది. ఆమె మీద నిషేధాన్ని ఎత్తివేయ‌డ‌మే కాకుండా, క్యాష్ట్ కౌచింగ్ పై ఓ క‌మిటీ కూడా వేసింది. త‌ద్వారా శ్రీరెడ్డి అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించిన‌ట్టు క‌నిపిస్తోంది.

అదే స‌మ‌యంలో సినిమాల‌లో ఎవ‌రెవ‌రిని తీసుకోవాల‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల మీద ఇష్టాయిష్టాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని మా తేల్చిచెప్పింది. త‌ద్వారా తెలుగు వారికి అవ‌కాశాల కోసం అంటూ శ్రీరెడ్డి చేసిన డిమాండ్ ని తోసిపుచ్చింది. కానీ కొద్దిరోజుల క్రితం మా నుంచి శ్రీరెడ్డి మీద నిషేధాన్ని విధించిన ఎట్ట‌కేల‌కు నిషేధం నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవ‌డంతో ఈ స‌మ‌స్య కొలిక్కివ‌చ్చిన‌ట్టేన‌ని ప‌లువురు భావిస్తున్నారు.


Related News

Manchu-Vishnu

శ్రీ రెడ్డి వివాదంలో మంచు విష్ణు ఎంట్రీ

Spread the loveశ్రీరెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. మ‌రింత సెగ రాజుకునేలా క‌నిపిస్తోంది. కొత్త త‌గాదాకు తెర‌లేపుతోంది.Read More

shruthi

బ‌హిరంగంగానే శృతిహాస‌న్…!

Spread the loveసినిమా తార‌ల ప్రైవేట్ లైఫ్ ఎప్పుడూ ఆస‌క్తిగానే ఉంటుంది. అందులోనూ హీరోయిన్ల వ్య‌వ‌హారాలు మ‌రింత చ‌ర్చ‌నీయాంశాల‌వుతాయి. శృతిRead More

 • భ‌ర‌త్ అనే నేను మువీపై ఆస‌క్తిక‌ర రిపోర్ట్
 • శ్రీరెడ్డిపై కొరటాల శివ ఆవేద‌న‌
 • ఎన్టీఆర్ స్థానంలో నాని..
 • చిరంజీవి సైరాకి సై అంటున్న త‌మ‌న్న‌
 • జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ స‌త్తా
 • అత‌డితో మ‌ళ్లీ జ‌త‌గ‌డుతున్న మ‌హేష్
 • శ్రీరెడ్డి సాధించింది…
 • సాయి ప‌ల్ల‌వి హ‌ద్దులు దాటేస్తోందా…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *