కొర‌టాల పొలిటిక‌ల్ కామెంట్స్..!

Prince-Mahesh-Babu-Gifts-Audi-A6-to-Koratala-Siva
Spread the love

సినిమాల్లో సామాజిక స్పృహ‌ను జోడించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. వ‌ర్త‌మాన రాజ‌కీయాల‌పై ఆయ‌న వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా క‌నిపిస్తున్నాయి. మిర్చి సినిమా ద్వారా ఫ్యాక్ష‌నిజాన్ని, శ్రీమంతుడు సినిమాలో భూదందాని, జ‌న‌తాగ్యారేజ్ లో కాలుష్యాన్ని నాశ‌నం చేస్తున్న కార్పోరేట్ తీరును చూపించిన కొర‌టాల ప్ర‌స్తుతం భ‌ర‌త్ అను నేను సినిమా షూటింగ్ లో ఉన్నారు. మ‌హేష్ బాబుతో రెండో సినిమా స‌క్సెస్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే తాజాగా ప్ర‌స్తుత రాజ‌కీయాలు పూర్తిగా దిగ‌జారిపోయాయంటూ కొర‌టాల కామెంట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. చివ‌ర‌కు దేవుడు కూడా ఈ రాజ‌కీయాల‌ను బాగు చేయాలేడంటూ శివ నిస్తేజం వ్య‌క్తం చేశారు. కానీ అంత‌లోనే ప్ర‌జ‌లంద‌రూ ప్ర‌శ్నించ‌డం మొద‌లుపెడితే రాజ‌కీయాల్లో మార్పు ఖాయ‌మ‌న్నారు. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రాజ‌కీయాల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషంగా భావిస్తున్నారు. ఎవ‌రికి వారు ప్ర‌య‌త్ని‌స్తే త‌ప్ప రాజ‌కీయాలు బాగుప‌డ‌వ‌ని ఆయ‌న పిలుపునివ్వ‌డం విశేషం

అయితే కొర‌టాల శివ వ్యాఖ్య‌ల వెనుక ఆయ‌న సినిమా నేప‌థ్యం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. భ‌ర‌త్ అను నేను సినిమాలో హీరో మ‌హేష్ బాబు ఎమ్మెల్యేగా న‌టించ‌బోతున్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయ నేప‌థ్యం ఆ సినిమాలో క‌నిపించే అవ‌కాశం ఉంది. దానికి త‌గ్గ‌ట్టుగానే తాజా వ్యాఖ్య‌ల‌ని చాలామంది భావిస్తున్నారు. కాగా కొర‌టాల వ్యా‌ఖ్య‌ల‌ప‌ట్ల చాలామంది నెటిజ‌న్లు మ‌ద్ద‌తు తెలిపారు.


Related News

DY4IkDSW4AE8pbm

మెగా ఫ్యామిలీ లుంగీల క‌థ తెలుసా..!

Spread the loveమెగాస్టార్ ఫ్యామిలీ లుంగీల వెంట‌ప‌డింది. అయితే అది ఇప్పుడిప్పుడే కాదండోయ్..చిరంజీవి కాలం నుంచి ఆ స‌ర‌దా ఉంది.Read More

Rakul-Preet-Singh-Images

ర‌కుల్ ఆయ‌న‌పై మ‌న‌సు ప‌డింది…!

Spread the loveటాలీవుడ్ లో రెండేళ్ల క్రితం ర‌కుల్ హ‌వా క‌నిపించింది. కానీ అంత‌లోనే ఆశ‌లు ఆవిర‌య్యాయి. వెంక‌టాద్రి ఎక్స్Read More

 • రాజ‌మౌళి కోసం స్పీడ్ పెంచిన త్రివిక్ర‌మ్
 • మెగాస్టార్ ముహూర్తం పెట్టేశాడు…
 • పూజాగానంలో టాలీవుడ్
 • గొల్ల‌భామ‌పై క్లారిటీ
 • చీటింగ్ కేసులో మ‌రో హీరోయిన్
 • ప్రెసిడెంట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ బ్యూటీ
 • చైనా వైపు చిరంజీవి చూపు
 • అన‌సూయ బ్యాక్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *