Main Menu

కీర్తికి గోల్డెన్ ఛాన్స్!

Spread the love

మహానటి సినిమాతో అందాల భామ కీర్తి సురేష్ క్రేజ్ బాగా పెరిగింది. అంతకుముందు గ్లామర్ హీరోయిన్‌గా ఆకట్టుకున్న కీర్తి మహానటి సినిమాతో తన నట విశ్వరూపం చూపించి శెబాష్ అనిపించుకుంది. తరువాత తమిళంలో రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమా కమర్షియల్‌గా వర్కవవుట్ కాలేదు. అ

యనా ఈ భామ తాజాగా గోల్డెన్ ఛాన్స్ అందుకున్నట్టు కోలీవుడ్ టాక్. జాతీయ దర్శకుడు మణిరత్నం సినిమాలో కీర్తి హీరోయిన్ చాన్స్ పట్టేసిందట. వరుస పరాజయాలతో డీలాపడ్డ మణిరత్నం లేటెస్ట్‌గా ‘నవాబ్స్’ సినిమాతో మళ్లీఫామ్‌లోకి వచ్చాడు. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన సినిమా తమిళంలో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మణిరత్నం మరో మల్టీస్టారర్‌కు సన్నాహాలు చేస్తున్నాడు.

రాజరాజ చోళుని చరిత్ర ఆధారంగా సినిమా ఉంటుందని టాక్. పొన్నియిన్ సెల్వం పేరుతో తెరకెక్కే సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఎంపికైందట. చారిత్రక నేపథ్యంవున్న కథతో తెరకెక్కనున్న సినిమా కోసం భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయ. అయితే వేరే సినిమాలతో బిజీగా ఉండటంవల్ల ఇందులో నటించడంలేదని విజయ్ సేతుపతి తెలిపినట్టు టాక్.






Related News

ర‌వితేజ వ‌స్తున్నాడు…!

Spread the loveరవితేజ ‘అమర్‌ అక్బర్‌ అంటోనీ’ చిత్రం అపజయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ సినిమా తర్వాత ఆయనRead More

ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో బిజినెస్ చేసేశారు..!

Spread the loveతెలుగులోనూ న‌టించిన బాలీవుడ్ బ్యూటీ వాపోయింది. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో బిజినెస్ చేసుకుంటున్నారంటూ మండిప‌డింది. దాంతో దిశాప‌ఠానీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *