Main Menu

ట్రిపుల్ ఆర్ సినిమాకి కీర్తి ఖాయం

Spread the love

మ‌హాన‌టికి మ‌రో బంప‌రాప‌ర్ ద‌క్కింది. ఇప్ప‌టికే సాగిన ప్ర‌చారానికి త‌గ్గ‌ట్టుగా ఆమె పేరు ఖాయం అయ్యింది. ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలో ఆమెకు అవ‌కాశం వ‌చ్చింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తొలిసారిగా న‌టించ‌బోతోంది. మహానటితో నటి కీర్తి సురేష్ పేరు ప్రఖ్యాతులు అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. తనదైన నటన, అభినయంతో కీర్తి ఈ చిత్రంలో నటించింది అనడం కంటే జీవించిందనడంలో సందేహం లేదు. ఆ ఒక్క చిత్రంతోనే కీర్తి రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అయితే ఆమె ఈ చిత్రం తర్వాత తెలుగులో డైరెక్టుగా ఏ ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ తమిళంలో బిజీగా మారింది.

అయితే ప్రస్తుతం ఆమె దృష్టి తెలుగులో ఓ పెద్ద ప్రాజెక్టు మీద ఉందని తెలిసింది. అదే దర్శక ధీరుడు రాజవౌళి టాలీవుడ్ టాప్ స్టార్స్ తారక్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టుకోసం కీర్తిని సంప్రదించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ భారీగా డేట్స్ కావాలనటంతో కీర్తికి వున్న ఇతర ప్రాజెక్టుల కమిట్‌మెంట్లకు సమస్య వచ్చే అవకాశం ఉండడంతో ఆలోచనలో పడ్డారట. సర్దుబాటు చేయగలిగితే ఈ చిత్రం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం వేరే చిత్రాలు ఏమీ అంగీకరించడంలేదట. ఈ భారీ ప్రాజెక్టు చేస్తే ఆమె క్రేజ్ రెండింతలు కావడం ఖాయం. దాంతో దాదాపుగా కీర్తి సురేష్ ని ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ గా ఖాయం చేసిన‌ట్టు చెబుతున్నారు.






Related News

స‌మంత 96

Spread the loveతమిళ చిత్రం ‘96’ హిట్టు టాక్ తెచ్చుకోవడంతో -టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆలస్యం చేయకుండాRead More

మ‌హేష్ మార్చిలోనే..!

Spread the loveమహేశ్‌ బాబు త్వరలో చేయనున్న తాజా చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *