కాజ‌ల్ కి షాకిచ్చిన హైకోర్ట్

kajal
Spread the love

చందమామ లాంటి కాజ‌ల్ కి చుక్కెదుర‌య్యింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ వేసిన పిటీష‌న్ ని కోర్ట్ కొట్టివేసి షాకిచ్చింది. 2011లో కోర్టుకెక్కిన ఆమె వాద‌న‌ న్యాయ‌స్థానం ముందు వీగిపోయింది. దాంతో వీవీడీ కొబ్బరినూనె తయారీ సంస్థపై కాజల్‌ వేసిన పిటిషన్ లో ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. 2008లో వీవీడీ కొబ్బరినూనె ప్రకటనలో నటించడానికి ఆ సంస్థతో కాజల్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్క ఏడాదిపాటే ప్రసారంచేయాలనే నిబంధనతోనే ఆ ప్రకటనలో నటించానని, కానీ దాన్ని ఆ తర్వాతా ప్రసారంచేశారని ఆరోపిస్తూ ఆమె మద్రాసు హైకోర్టులో కేసు వేశారు.

ఆ ప్రకటన ప్రసారాన్ని నిలిపివేయాలని, నిబంధనలు అతిక్రమించి ప్రసారం చేసినందుకు తనకు రూ. 2.50 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా సంస్థను ఆదేశించాలని కోర్టును కోరారు. తుది విచారణ జరిపిన జడ్జి జస్టిస్‌ టీ రవీంద్రన్‌ కాపీరైట్స్‌ చట్టప్రకారం ఒక ప్రకటన దాన్ని రూపొందించిన సంస్థకే చెందుతుందన్నారు. ఒక్క ఏడాదే ఆ ప్రకటనను ప్రసారం చేయాలనే హక్కు కాజల్‌కు లేదన్నారు. ఒక వాణిజ్యప్రకటన ప్రమోషన్‌ హక్కులు ఆ సంస్థకు 60 ఏళ్ల వరకూ ఉంటాయని తీర్పు చెప్పారు.






Related News

????????????????????????????????????

ఆ డైరెక్టర్ తో తగాదా గురించి తమన్నా ఏమందంటే..

Spread the loveటాలీవుడ్ మిల్కీబ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ ని రీమేక్ చేసే పనిలో పడింది. దక్షిణాదిలో అన్నిRead More

rakul

బాలీవుడ్ వైపు కన్నేసిన బ్యూటీ

Spread the loveతెలుగులో తడబడుతున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ వైపు కన్నేసింది. ఇటీవల సినిమాలు పెద్దగాRead More

  • చిరంజీవి మీసాల వెనుక అసలు కథ ఇది…
  • అజ్ఞాతవాసి రిజల్ట్ తో ఎన్టీఆర్ కలవరం
  • వచ్చే నెలలో టచ్ చేస్తున్న రవితేజ
  • హెబ్బా పటేల్ 24 ముద్దులు
  • ప్రభాస్ కష్టం గురించి అనుష్క..
  • పవన్ వెరీ స్పెషల్ పర్సన్
  • చిరుకి కాదని, పీకేకి ఓకే చెప్పిన చంద్రబాబు
  • సెలవులు ముగించుకున్న మహేష్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *