మురిపించిన లవుడు…

1502086447_jai-lava-kusa
Spread the love

లవుడు మురిపించాడు. మనసు దోచాడు. అభిమానులను అలరించాడు. స్టయిలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే మాస్ గెటప్ తో జై అనిపించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు లవ్లీగా లవ రూపంలో దర్శనమిచ్చాడు. దాంతో జై లవకుశ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మరింత ఆసక్తిపెరిగింది.

హీరోగా కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ‘జై’ గెటప్‌ని ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా మేలో విడుదల చేశారు. ఇప్పుడు లవకుమార్‌ని చూపించారు.

వాస్తవానికి ఈ గెటప్‌కి సంబంధించి ఒక్క పోస్టర్‌ని మాత్రమే విడుదల చేయాలనుకున్నారు. అయితే, అన్నదమ్ములు కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌లకు రెండు పోస్టర్లు నచ్చాయి. ఏది రిలీజ్‌ చేస్తే బాగుంటుందా? అని ఆలోచించి.. చివరకు ఎటూ తేల్చుకోలేక అభిమానులకు డబుల్‌ ధమాకా ఇచ్చేశారు. రెండు ఫొటోలు విడుదల చేశారు. లవ అలియాస్‌ లవకుమార్‌ చాలా లవ్లీగా ఉన్నాడు కదూ! ఈ లుక్స్‌ చూసి అభిమానులు ఆనందపడిపోయారు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. తారక్ ఫ్యాన్స్ కి దాంతో దసరా సంబరాలు మిన్నంటుతాయని భావిస్తున్నారు.






Related News

balakrishna11465816265

మరో సింహా కి ఫిక్సయిన బాలయ్య

Spread the love1Shareనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తోన్న సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవి కుమార్‌ దర్శకత్వంRead More

ntr pawan1

ఎన్టీఆర్, పవన్ ని కలిపిన త్రివిక్రమ్

Spread the love4Sharesయంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతులRead More

  • ప్రభాస్ బర్త్ డే కానుక..
  • పాపం..రాజా దిగ్రేట్
  • జవాన్ ముహూర్తం రెడీ
  • సీనియర్ హీరోతో మెహరీన్
  • యూరప్ కి పవన్ కల్యాణ్..
  • పెళ్లికి పిలుస్తానని ప్రకటించిన రేణూదేశాయ్
  • పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి నిరాశ…
  • మహేష్ ఫ్యామిలీ ముచ్చట..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *