ప్రెగ్నెన్సీ గురించి స‌మంత ఏం చెప్పిందంటే…

SAMANTHA
Spread the love

అక్కినేని స‌మంత అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా ఆరు నెల‌ల క్రితం అక్కినేని వారి ఇంట కోడ‌లిగా అడుగుపెట్టిన స‌మంత రూత్ ప్ర‌భు ప్ర‌స్తుతం అక్కినేని స‌మంతగా మారింది. ఇటీవ‌లే రంగ‌స్థ‌లం మువీతో భారీ హిట్ కొట్టింది. ఆమె న‌ట‌న‌కు కూడా మంచి మార్కులు ప‌డ్డాయి. రామ్ చ‌ర‌ణ్ కి త‌గిన రీతిలో న‌టించ‌డం ద్వారా అంద‌రి ప్ర‌శంస‌లు పొందింది. త్వ‌ర‌లో మ‌హాన‌టి మువీ ద్వారా ఈ వేస‌విలో మ‌రోసారి సంద‌డి చేయ‌డానికి స‌న్న‌ద్ద‌మ‌వుతోంది.

అయితే ఈలోగా స‌మంత ప్రెగ్నెంట్ అంటూ క‌థ‌నాలు రావ‌డం మొద‌ల‌య్యింది. ప‌లు వెబ్ సైట్ల‌లో ఆమె వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారంపై వ‌రుస‌గా వార్త‌లు రావ‌డంతో వ్య‌వ‌హారం ఆమె చెవిన ప‌డింది. దాంతో అమె ఈ క‌థ‌నాల‌పై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. న‌వ్వుతూ స్పందించారు. ఈ వార్త‌ల గురించి త‌న‌కు కూడా తెలిసింద‌ని., కానీ తాము మాత్రం న‌వ్వుకున్నామ‌ని చెప్పింది. త‌న‌కు పెళ్లి త‌ర్వాత న‌టించే విష‌యంలో రాజీ ప‌డ‌లేద‌ని పేర్కొన్న స‌మంత‌, పిల్ల‌ల గురించి త‌మ‌కో ప్లాన్ ఉంద‌న్నారు. అయితే ప్ర‌స్తుతం గ‌తంలో మాదిరిగా కాకుండా ఏం చేసినా ఫ్యామిలీ బాధ్య‌త గుర్తొస్తోంద‌ని తెలిపింది.

దాంతో ప్రెగ్నెన్సీ విష‌యంలో స‌మంత క్లారిటీ ఇవ్వ‌డంతో ఇలాంటి క‌థ‌నాల‌కు తాత్కాలికంగా బ్రేక్ ప‌డుతుంద‌ని అంతా ఆశిస్తున్నారు.






Related News

tollywood

చానెళ్ల‌కు చెక్ పెట్టాల‌ని హీరోల నిర్ణ‌యం!

Spread the loveటాలీవుడ్ టాప్ హీరోలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. న్యూస్ చానెళ్ల వ్య‌వ‌హారంతో తీవ్రంగా క‌ల‌త చెందుతున్న స్టార్లంతాRead More

mahesh babu

మ‌హేష్ ఫిక్స‌య్యాడు..

Spread the loveభ‌ర‌త్ అనే నేను విజ‌యంతో ఊపుమీద‌కొచ్చిన మ‌హేష్ బాబు త‌న నెక్ట్స్ మువీని క‌న్ఫ‌ర్మ్ చేశారు. మ‌హేష్Read More

  • శ్రీ రెడ్డి వివాదంలో మంచు విష్ణు ఎంట్రీ
  • బ‌హిరంగంగానే శృతిహాస‌న్…!
  • భ‌ర‌త్ అనే నేను మువీపై ఆస‌క్తిక‌ర రిపోర్ట్
  • శ్రీరెడ్డిపై కొరటాల శివ ఆవేద‌న‌
  • ఎన్టీఆర్ స్థానంలో నాని..
  • చిరంజీవి సైరాకి సై అంటున్న త‌మ‌న్న‌
  • జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ స‌త్తా
  • అత‌డితో మ‌ళ్లీ జ‌త‌గ‌డుతున్న మ‌హేష్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *