Main Menu

సెగ‌ల ‘రాయ్’..!

Spread the love

ఎంఎస్ ధోని ప్రేయసిగా కలకలం రేపిన తర్వాతనే రాయ్‌లక్ష్మీ పాపులారిటీ స్క్రైని టచ్ చేసింది. తర్వాత వరుసగా సినిమా ఆఫర్లువచ్చాయి. తలా అజిత్ అంతటివాడు గ్యాంబ్లర్ సినిమాలో ఛాన్సిచ్చాడు. లారెన్స్ కాంచన చిత్రంలోనూ రాయ్‌లక్ష్మీ నటన అబ్బురపర్చింది. తర్వాత మెగా బాస్ చిరంజీవి రాయ్‌లక్ష్మీని పిలిచి రత్తాలుగా మార్చేశాడు. అయితే ఇటీవల ఈ అమ్మడు మరీ నల్లపూస అయిపోతోంది. ఇటు టాలీవుడ్‌లో అమ్మడి జోరు ఏమంత కనిపించలేదు. కానీ స్పెషల్ నంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లతో మాత్రం సౌత్‌లో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

2018లో బాలీవుడ్‌లో జూలీగా నటించిన లక్ష్మీరాయ్‌కి ఆ సినిమా పరాజయo మిగిల్చడంతో బాలీవుడ్ ఊసే ఎత్తలేదు. 2019లో మాత్రం ఈ అమ్మడు పలు ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తోంది. తన బ్రాండ్‌లో గ్లామర్ ఎలివేషన్‌తోపాటు హారర్ టెర్రర్ కానె్సప్టు చిత్రాల్లోనూ రాయ్‌లక్ష్మీ నటిస్తోంది. ప్రస్తుతం తమిళంలో నీయ 2 సెట్స్‌పై ఉంది. అలానే మమ్ముట్టి నటిస్తున్న ‘ఒరు కూట్టందాన్‌బ్లాగ్’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ హ్యాపీతో అభిమానులకు సామాజిక మాధ్యమాల్లో స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేసింది. కొత్త ఏడాదిలో కొత్త ఫొటో షూట్‌తో టచ్‌లోకి వచ్చింది. రాక్ సాలిడ్ భవంతిలో లక్ష్మీరాయ్ ఇచ్చిన ఫోజు కుర్రకారు కంటిపై కునుకు పట్టనీయడం లేదట. అదే ఇది.






Related News

ర‌వితేజకి ఇద్ద‌రు!

Spread the love కాజల్‌ అగర్వాల్‌ మరో తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఆమె రవితేజకు జోడీగా నటించనుంది.Read More

ప్ర‌భాస్ పిరియాడిక్ మువీ..!

Spread the love ‘సాహో’ చిత్రీకరణలో వుండగానే ప్రభాస్‌ ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇదివరకే యూరప్‌లో కొంతభాగంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *