Main Menu

ర‌వితేజకి ఇద్ద‌రు!

Spread the love

కాజల్‌ అగర్వాల్‌ మరో తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఆమె రవితేజకు జోడీగా నటించనుంది. రవితేజ హీరోగా ‘కనకదుర్గ’ సినిమా రూపొందునుంది. ఇది తమిళంలో విజయం సాధించిన ‘తెరి’ సినిమాకు రీమేక్‌గా ఇక్కడ రూపొందనుంది. కాజల్‌ అగర్వాల్‌, రవితేజ గతంలో ‘సారొచ్చారు’, వీర’ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మూడోసారి జోడీ కట్టబోతున్నారు. ఈ చిత్రంలో కేథరిన్‌ కూడా రవితేజకు జోడీగా నటించబోతుంది. ఈ సినిమా విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుంది. ఇందులో నిజాయితీ గల పోలీస్‌ ఆఫీసర్‌గా రవితేజ నటించబోతున్నాడు. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్నారు. తమిళంలో ‘తెరి’ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. తెలుగులో ఇది ‘పోలీస్‌’గా అనువదించారు. విజరు, సమంత, అమైరా జాక్సన్‌ కథానాయికలు. తెలుగులో ‘కనకదుర్గ’ పేరుతో తెరకక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం రవితేజ ‘డిస్కో రాజా’ సినిమా షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు.






Related News

ర‌వితేజ వ‌స్తున్నాడు…!

Spread the loveరవితేజ ‘అమర్‌ అక్బర్‌ అంటోనీ’ చిత్రం అపజయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ సినిమా తర్వాత ఆయనRead More

ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో బిజినెస్ చేసేశారు..!

Spread the loveతెలుగులోనూ న‌టించిన బాలీవుడ్ బ్యూటీ వాపోయింది. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో బిజినెస్ చేసుకుంటున్నారంటూ మండిప‌డింది. దాంతో దిశాప‌ఠానీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *