మిసెస్ కోహ్లీకి అరుదైన ఘ‌న‌త‌

anushka sharma
Spread the love

మిసెస్ కోహ్లీ క‌న్నా ముందే బాలీవుడ్ లో మంచి గుర్తింపు సాధించిన అనుష్క శ‌ర్మ మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకోబోతోంది. స్టార్ క్రికెట‌ర్ ని వివాహం చేసుకున్న ఈ స్టార్ హీరోయిన్ కి ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వ‌రించ‌బోతోంది. సినిమాల్లో న‌టిస్తూనే సినిమాలు నిర్మిస్తూ నిర్మాత‌గా రాణిస్తున్న మ‌హిళ‌గా అనుష్క‌కు గుర్తింపు ద‌క్కింది. ప్రియాంక చోప్రా త‌ర్వాత నిర్మాత‌గానూ రాణిస్తున్న హీరోయిన్ గా అనుష్క శ‌ర్మ‌కు త్వరలో ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌’ పురస్కారం ద‌క్క‌బోతోంది.

ఎప్పుడు ఈ అవార్డు అందజేస్తున్నది మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. కానీ అధికారికంగా స‌ద‌రు ఫౌండేష‌న్ నుంచి ప్ర‌క‌ట‌న రావ‌డంతో అనుష్క‌శ‌ర్మ ఆనందం వ్య‌క్తం చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ అనుష్క శర్మ తన క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో మూడు సినిమాలను నిర్మించింది. ఎన్‌హెచ్‌ 10, ఫిలౌరీ, పరి..ఈ మూడు సినిమాలు విభిన్నమై జోనర్‌లో హార్రర్‌ థ్రిల్లర్స్‌గా రూపొందించారు. అందులో మొదటి చిత్రం ‘ఎన్‌హెచ్‌ 10’ మంచి విజయాన్ని అందించింది. ఈ విజయంతో మరో రెండు సినిమాలు నిర్మించేందుకు అవకాశం లభించింది. ఈ రెండూ కూడా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ చిత్రాల నిర్మాణంలో అనుష్క సోదరుడు కర్నేశ్‌ భాగస్వామ్యం కూడా ఉంది. మొత్తంగా కోహ్లీ ఐపీఎల్ లో ప‌రుగుల వ‌ర‌ద, అనుష్క బాలీవుడ్ లో క‌లెక్ష‌న్ల వ‌ర‌ద పారిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.


Related News

Manchu-Vishnu

శ్రీ రెడ్డి వివాదంలో మంచు విష్ణు ఎంట్రీ

Spread the loveశ్రీరెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. మ‌రింత సెగ రాజుకునేలా క‌నిపిస్తోంది. కొత్త త‌గాదాకు తెర‌లేపుతోంది.Read More

shruthi

బ‌హిరంగంగానే శృతిహాస‌న్…!

Spread the loveసినిమా తార‌ల ప్రైవేట్ లైఫ్ ఎప్పుడూ ఆస‌క్తిగానే ఉంటుంది. అందులోనూ హీరోయిన్ల వ్య‌వ‌హారాలు మ‌రింత చ‌ర్చ‌నీయాంశాల‌వుతాయి. శృతిRead More

 • భ‌ర‌త్ అనే నేను మువీపై ఆస‌క్తిక‌ర రిపోర్ట్
 • శ్రీరెడ్డిపై కొరటాల శివ ఆవేద‌న‌
 • ఎన్టీఆర్ స్థానంలో నాని..
 • చిరంజీవి సైరాకి సై అంటున్న త‌మ‌న్న‌
 • జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ స‌త్తా
 • అత‌డితో మ‌ళ్లీ జ‌త‌గ‌డుతున్న మ‌హేష్
 • శ్రీరెడ్డి సాధించింది…
 • సాయి ప‌ల్ల‌వి హ‌ద్దులు దాటేస్తోందా…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *