Main Menu

సైరా త‌ర్వాత చిరు స్టార్టింగ్ ..

Spread the love

మెగాస్టార్ వ‌రుస మువీస్ తో సిద్ధ‌మ‌వుతున్నారు. రీ ఎంట్రీ త‌ర్వాత ఖైదీ నెంబ‌ర్ 150 తో స‌క్సెస్ కొట్టిన చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి అంటూ ముందుకొస్తున్నారు. ఆవెంట‌నే త‌దుప‌రి సినిమాకు ఈ వేస‌విలో ముహూర్తం పెట్టుకున్నారు. స‌క్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నారని గత కొన్నినెలలుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇటు కొరటాల నుండి గాని, అటు మెగా క్యాంపునుండి గాని ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటకన రాలేదు.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం కొరటాల శివ, మెగాస్టార్‌తో చెయ్యబోతున్న సినిమా ఈ వేసవినుంచి మొదలుకానుందని తెలుస్తోంది. చిరుకోసం కొరటాల ఓ మంచి సోషల్ మెసేజ్‌తో కూడుకున్న స్క్రిప్టును తయారుచేశారట. దానికి చిరంజీవి సై అన‌డంతో సినిమా స్టార్ట్ చేయ‌డం ఖాయంగా మారింద‌ని స‌మాచారం. దాంతో ఈ కాంబినేష‌న్ ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.






Related News

మ‌హేష్ తో అర్జున్ రెడ్డి..!

Spread the loveవిజయ్ దేవరకొండను అర్జున్‌రెడ్డితో ఒక్కసారిగా స్టార్ హీరోను చేసిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ ప్రస్తుతం అదే అర్జున్‌రెడ్డినిRead More

ప్ర‌భాస్ కి ఆమె ఏం పంపిందో తెలుసా?

Spread the loveబాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ లో హీరోయిన్ గా నటిస్తున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *