షాక్ కి గురయిన చిరు

varuntej
Spread the love

మెగాస్టార్ చిరంజీవి షాక్ కి గురయ్యారు. అవునా అని అనుమానం వస్తోందా..అవుననే అంటున్నాడు వరుణ్ తేజ్. తాజాగా తన సినిమా ‘తొలిప్రేమ’ను చూసి చిరు షాకయ్యారని తెలిపాడు. ‘ఈ సినిమా తీసింది.. కొత్త దర్శకుడా?’ అని చిరంజీవి ఆశ్యర్యపోయినట్టు తెలిపాడు. ఈ సినిమా విజయోత్సవ సభలో వరుణ్ తేజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో రాశీఖన్నా సహా పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కథానాయకుడు వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ..నాపైనా, వెంకీపైనా నమ్మకంతో దిల్‌రాజుగారు ఈ సినిమాను తీసుకొచ్చారు. ఆయన లేకపోతే సినిమా లేదు. సినిమాపై వెంకీకి ఉన్న ఇష్టం, ప్యాషన్‌ ఇందులో కనపడతాయి. అతని సినీ కెరీర్‌ సుదీర్ఘంగా సాగాలి. సినిమా చూసిన చిరంజీవి గారు ఏంటి ఇది తీసింది కొత్త దర్శకుడా? అని షాకయ్యారు. మాకు అదో పెద్ద కాంప్లిమెంట్‌. తెరపై నాది, రాశీఖన్నా కెమిస్ట్రీ బాగున్నా, తెరవెనుక జార్జ్‌.. తమన్‌.. వెంకీ కెమిస్ట్రీ వర్క్‌ అవుట్‌ కావడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. వాళ్లు సినిమాను ప్రేమించారు. వర్ష పాత్రలో రాశీఖన్నా ఇమిడిపోయింది. జనాల నుంచి వస్తున్న అభినందనలే అందుకు ఉదాహరణ. అని అన్నారు.


Related News

Renu

రేణూ దేశాయ్ హృద‌యం ప‌గిలింది…

Spread the loveఅవునంటోంది జ‌న‌సేనాని మాజీ భార్య‌. న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, టీవీ ప్ర‌యోక్త‌గా రాణించిన రేణూదేశాయ్ తాజాగా సోష‌ల్ మీడియాలోRead More

ramcharan_2055

చెర్రీ రంగ‌స్థ‌లంపై కొత్త మొఖం ఎంట్రీ

Spread the loveమెగాప‌వ‌ర్ స్టార్ లేటెస్ట్ మువీ రంగ‌స్థ‌లం ఆస‌క్తి రేపుతోంది. ఇప్ప‌టికే టీజ‌ర్ హ‌ల్ చ‌ల్ చేసింది. సింగిల్Read More

 • కాజల్ పెళ్లి!
 • ప్రియా వారియ‌ర్ కి ఊర‌ట‌
 • మరో ఫ్యామిలీ మల్టీస్టారర్‌..!
 • రాశిఖ‌న్నాకి బంప‌రాఫ‌ర్ !
 • జిగేల్ మంటున్న రామ్ చ‌ర‌ణ్
 • ఆస్ప‌త్రి పాల‌యిన స్టార్ హీరో
 • ర‌కుల్ బికినీపై రచ్చ‌
 • జ్యోతికపై కేసు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *