ఈవారంలోనే సైరా అంటున్న చిరు

syra
Spread the love

ట్రెండ్‌కు అనుగుణంగా వెళ్లాలని భావించి ఆ తరహాలోనే ‘ఖైదీ నంబర్‌ 150’లో కనిపించే ప్రయత్నం చేశాడు చిరంజీవి. దీని తర్వాత స్వాతంత్య్ర సమరయోధుడు రాయలసీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథా చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం బయోపిక్‌లకు సక్సెస్‌ లభిస్తున్న తరుణంలో మెగాస్టార్‌ ఈ మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ కథకు ‘సైరా నరసింహారెడ్డి’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవల టైటిల్‌ను, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. మంచి స్పందన వచ్చింది. సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఈవారంలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

చిరంజీవిని ప్రత్యేకంగా చూపించడం కోసం బాలీవుడ్‌లో ‘బాజీరావు మస్తాని’, ‘రామ్‌ లీలా’ చిత్రాలకు డిజైనర్‌గా పనిచేసిన అంజు ‘సైరా’కు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఈ పనిమీద ఉన్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత అంజుకి సహాయంగా ఉన్నారట. వీరిద్దరితోపాటు మరో పది మంది దుస్తుల డిజైన్‌ కోసం పరిశోధన చేస్తున్నట్లు సమాచారం. స్వాతంత్య్రానికి ముందు ఉన్న సంస్కృతి, అప్పటి వస్త్రధారణకు అనుగుణంగా వీరి డిజైన్స్‌ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌ కోసం తమిళనాడులోని పొల్లాచిలో భారీ సెట్‌ వేస్తున్నారు. షూటింగ్‌ అక్కడే ప్రారంభం కానుంది.

హిందీ, తమిళ్‌, కన్నడ ప్రేక్షకులకు చేరవయ్యేందుకో పాత్రలు డిమాండ్‌ చేశాయో గానీ అన్ని భాషల నటులను ఇందులో నటింపజేస్తున్నారు. హిందీ నుంచి అమితాబ్‌ బచ్చన్‌, తమిళ్‌ నుంచి విజరు సేతుపతి, కన్నడ నుంచి సుదీప్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథానాయిక ఎవరు అన్నది ఇంకా స్పష్టత రాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా నిర్మాణ పనులు చేపట్టారు.


Related News

pawan trivikram

పవన్ ఫిక్సయ్యాడు..

Spread the love పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘అజ్ఞాత వాసి'(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో బయటకొచ్చిRead More

What-s-wrong-if-Heroes-are-praised---Bandla-Ganesh-1511091914-1011

బండ్ల గణేష్ కి జైలు శిక్ష

Spread the loveప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇరకాటంలో పడ్డారు. అనూహ్యంగా జైలు శిక్షకు గురయ్యారు. గతంలో టెంపర్Read More

 • పద్మావతికి గ్రీన్ సిగ్నల్
 • మెగా పవర్ ఫుల్ కాఫీ టైమ్
 • బొద్దుగుమ్మ పెళ్లికూతురాయెనే..
 • లవ్ ఎఫైర్ పై నారా రోహిత్ స్పందన
 • టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్
 • పవన్ కల్యాణ్ వారణాశి వెళ్లుతున్నదందుకే
 • కత్తి మహేష్ లవ్ లెటర్ ఎవరికి రాశాడో తెలుసా?
 • సన్నీ తర్వాత ఇవాంక అంటున్న వర్మ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *