చిరంజీవి మీసాల వెనుక అసలు కథ ఇది…

chiranjeevi
Spread the love

మీసమున్న నేస్తమా..నీకు రోషమెక్కువా అంటూ స్నేహం కోసం సినిమాలో సాంగేసుకున్న మెగాస్టార్ తాజాగా మీసాలు తీసేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొన్నటి వరకు గుబురు మీసాలు, పెరిగిన గడ్డంతో కొత్తలుక్‌లో కన్పించిన చిరంజీవి ఒక్కసారిగా క్లీన్‌షేవ్‌తో కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చాడు. ఆయన హీరోగా ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కుతోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని చరణ్‌ నిర్మిస్తున్నాడు. నయనతార, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా షూటింగ్‌కు విరామం ఇచ్చారు. ఇప్పుడు మీసాలు, గడ్డాలు చిరంజీవి తీసేయడంపై చాలా పుకార్లు షికారు చేశాయి. అసలు క్లీన్‌షేవ్‌కు కారణం ఏంటో స్వయంగా చిరునే ప్రకటించాడు. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఒక గ్రాఫిక్‌ షాట్‌ ఉందట. ఆ షాట్‌ కోసం తప్పనిసరిగా మీసాలు, గడ్డం తీసేయ్యాల్సిందేనట. అవి తీస్తేనే షాట్‌కి అనుగుణంగా మార్పులు చేసుకునే అవకాశం ఉందనీ అందుకే తీయాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు చిరంజీవి. వచ్చే షెడ్యూల్‌ ఫిబ్రవరిలో ఉంటుందని ఉంటుందని ఆయన తెలిపారు.


Related News

????????????????????????????????????

ఆ డైరెక్టర్ తో తగాదా గురించి తమన్నా ఏమందంటే..

Spread the loveటాలీవుడ్ మిల్కీబ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ ని రీమేక్ చేసే పనిలో పడింది. దక్షిణాదిలో అన్నిRead More

rakul

బాలీవుడ్ వైపు కన్నేసిన బ్యూటీ

Spread the loveతెలుగులో తడబడుతున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ వైపు కన్నేసింది. ఇటీవల సినిమాలు పెద్దగాRead More

 • చిరంజీవి మీసాల వెనుక అసలు కథ ఇది…
 • అజ్ఞాతవాసి రిజల్ట్ తో ఎన్టీఆర్ కలవరం
 • వచ్చే నెలలో టచ్ చేస్తున్న రవితేజ
 • హెబ్బా పటేల్ 24 ముద్దులు
 • ప్రభాస్ కష్టం గురించి అనుష్క..
 • పవన్ వెరీ స్పెషల్ పర్సన్
 • చిరుకి కాదని, పీకేకి ఓకే చెప్పిన చంద్రబాబు
 • సెలవులు ముగించుకున్న మహేష్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *