కాజల్ కి ఊరటనిచ్చిన హైకోర్ట్

kajal
Spread the love

సినీ నటి కాజల్‌అగర్వాల్‌ కి ఊరట లభించింది. తనకు సంబంధించిన కేసులో చెన్నై హైకోర్ట్ స్టే విధించడం ఆమెకు రిలీఫ్ కలిగించింది. గతంలో వేసిన పిటీషన్ ని పత్యేక కోర్ట్ కొట్టివేయడంతో ఆమె హైకోర్ట్ ని ఆశ్రయించారు. దాంతో దిగువ కోర్ట్ పిటిషన్‌ కొట్టివేతపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. కాజల్‌అగర్వాల్‌ చెన్నైకి చెందిన వాణిజ్య సంస్థ వీవీడీ అండ్‌ సన్స్‌ ప్రొడెక్ట్‌ వీవీడీ కొబ్బరి నూనె ప్రచార ప్రకటనలో నటించారు. అయితే ఆ ప్రకటన గడుపు ముగిసిపోయినా ప్రచారం చేసుకుంటున్నారని నటి కాజల్‌ ఆ సంస్థపై చెన్నైలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో ఆమె తనకు నష్టపరిహారంగా రూ.2.5 కోట్లను వీవీడీ అండ్‌ సన్స్‌ సంస్థ చెల్లించాలని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి టి.రవీంద్రన్‌ కాజల్‌అగర్వాల్‌ నటించిన వాణిజ్యప్రకటనపై కాపీ చట్టం ప్రకారం ఆ సంస్థకు 60 ఏళ్లు హక్కు ఉంటుందని పేర్కొంటూ కేసును కొట్టివేశారు. దీంతో కాజల్‌అగర్వాల్‌ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం కాజల్‌ పిటిషన్‌ విచారణకు రాగా ప్రతివాదులు బదులు పిటిషన్‌ దాఖలు చేయకపోవడంతో ఈ కేసుపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చే సింది. దాంతో న్యాయపోరాటం కొనసాగించడానికి సిద్ధపడిన కాజల్ కి కొంత ఆశలు చిగురించినట్టే కనిపిస్తోంది.


Related News

jyotika-story_647_112517121159

జ్యోతికపై కేసు

Spread the loveసీనియర్ నటి, హీరో సూర్య సతీమణి జ్యోతికపై కేసు నమోదయ్యింది. చెన్నైలో ఆమెకు వ్యతిరేకంగా నమోదయిన కేసుRead More

Ram-Charans-Rangasthalam-beats-Stylish-Star-Allu-Arjuns-Naa-Peru-Surya-record

చెర్రీని క్రాస్ చేసిన అల్లు అర్జున్

Spread the loveమెగా హీరోల మధ్య ఆసక్తికర పోటీ సాగుతోంది. ఇప్పటికే వరుణ్ తేజ్‌ ‘తొలిప్రేమ’ తో మంచి మార్కులుRead More

 • షాక్ కి గురయిన చిరు
 • లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే…
 • ప్రభాస్ పూర్తిగా యూరప్ లోనే…
 • ప్రభాస్ గురించి నన్ను విసిగించకండి…
 • సైరా సినిమా నుంచి బిగ్ వికెట్ డౌన్
 • అనసూయకు షాక్
 • ముదురు హీరోకి దొరికిందట..
 • మూగమ్మాయి సమంత గుడ్ బై
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *