పవన్, బాలయ్య మధ్య పోటీ

pawan_kalyan_vs_balakrishna
Spread the love

సంక్రాంతి కోసం సిద్ధమవుతున్న నందమూరి బాలయ్య మరో సంచలనానికి తెరలేపుతున్నారు. తాజాగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కోసం ఆసక్తికర టైటిల్ ను అన్వేషిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రానికి ఏం టైటిల్‌ పెట్టనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ ‘జయసింహ’ అనే టైటిల్‌ పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరగగా, తాజాగా ‘కర్ణ’ అనే టైటిల్‌ తెరపైకి వచ్చింది. ఈ టైటిల్‌ దాదాపు ఖాయమన్నట్లుగా అంతర్జాలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని నిర్మాత సి. కల్యాణ్‌ తెలిపారు. ‘కర్ణ’ అనే టైటిల్‌ పెట్టే అవకాశం లేదనీ, ‘ఎన్‌బీకే కర్ణ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉందనీ ఆయన చెప్పారు. దీనితో పాటు ‘జయసింహ’, ‘లక్ష్మీనరసింహారెడ్డి’ అనే టైటిళ్లను కూడా పరిశీలిస్తున్నామన్నారు.

బాలయ్య సరసన మూడోసారి నాయికగా నయనతార నటిస్తోన్న ఈ చిత్రం ద్వారా నటాషా దోషి మరో నాయికగా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక కంటైనర్‌ యార్డ్‌లో క్లైమాక్స్‌ సన్నివేశాల్ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ, నయనతార, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌ సహా చిత్రంలోని ప్రధాన తారాగణమంతా ఇందులో పాల్గొంటున్నారు. ఈ నెల 16 వరకు ఈ సన్నివేశాల్ని తీస్తారు. ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి స్వరాలు కూర్చిన చిరంతన్‌ భట్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. దాంతో పవన్ కల్యాణ్ కూడా సంక్రాంతికి సిద్దమవుతున్న తరుణంలో బాలయ్య, పీఎస్పీకే మధ్య ఆసక్తికర పోటీ అనివార్యంగా మారుతుందా అన్న చర్చ మొదలయ్యింది.


Related News

ntr

బాగా తగ్గిపోయిన తారక్..

Spread the loveఎన్టీఆర్ విలక్షణ నటుడిగా మారుతున్నాడు. క్యారెక్టర్ అవసరాలను బట్టి శారీరక మార్పులతో ఇప్పటికే చాలాసార్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.Read More

chiru son in law kalyan

చిరు అల్లుడికి చిన్నది కన్ఫర్మ్

Spread the love1Share మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ హీరోగా త్వరలో ఓ సినిమా చేయనున్నారు. రాకేశ్‌ శశి ఈRead More

 • శ్రీలంకకు ఊరట విజయం
 • ప్రఖ్యాత పత్రికకు షాకిచ్చిన హీరో
 • తమన్నాకి అలాంటి స్థితిలో పడిపోలేదట..
 • షూటింగ్ లో గాయపడ్డ నందమూరి వారసుడు
 • మైండ్‌బ్లాక్‌ అయిపోయింది…
 • పవన్ కళ్యాణ్ అజ్ఞానవాసి
 • జోరు పెంచిన రవితేజ
 • చెర్రీకి ‘అను’ ‘రాశి’ పెట్టి ఉందా..?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *