బాహుబ‌లికి నెట్టింట్లో పాతిక కోట్లు

bahubali
Spread the love

రెండు భాగాలుగా విడుదలైన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ప్రేక్షకాదరణ చూరగొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలను థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు అధికారికంగా ఆన్‌లైన్లో చూడొచ్చు. ప్రముఖ ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ సర్వీస్‌ నెట్‌ఫ్లిక్‌ ఈ చిత్రాల ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.

మొత్తం రూ.25.50 కోట్ల భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్‌ హక్కులను కొనుగోలు చేసినట్లు చిత్ర వర్గాల సమాచారం. దీంతో 192 దేశాల్లో ఈ చిత్రం ఆన్‌లైన్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ చిత్రం ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్‌ సొంతం చేసుకుంది. రూ.20 కోట్ల‌కు ‘దంగల్‌’ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఓ ప్రాంతీయ చిత్రంగా ప్రారంభమైన ‘బాహుబలి’ అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.


Related News

tapsee

ఎన్టీఆర్ బిగ్ బాస్ లో హాట్ బ్యూటీ

Spread the love4Sharesబిగ్ బాస్ కొత్త సంచలనం రేకెత్తించబోతోంది. తాజాగా రేటింగ్స్ లో దూసుకుపోతున్న ఈ రియాలిటీ షోకి కొత్తRead More

Kabali-Rajinikanth-Mahesh-Babu

మహేష్ కోసం మరో సూపర్ స్టార్

Spread the love5Sharesఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. మహేష్ బాబు తాజా సినిమా స్పైడర్ రిలీజ్ కి సిద్దమవుతోంది. ఇప్పటికేRead More

 • స్టార్ హీరోకి నో చెప్పిన ఫిదా పోరి..
 • వినాయక చవితికి ఎన్టీఆర్ సిద్ధం
 • ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్ సిద్దం చేసిన చిరంజీవి
 • పీకే, త్రివిక్రమ్ మువీకి ఆసక్తికర టైటిల్
 • ప్రభాస్ కి అది నచ్చిందట
 • రవితేజ నయా గెటప్
 • మహేష్ మువీని పిల్లలు మెదలెట్టారు..
 • బ‌న్నీది ఎన్టీఆర్ కి ఇష్ట‌మ‌ట‌..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *