జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ స‌త్తా

DapfoMrUQAA0MNT
Spread the love

జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డులు ప్ర‌క‌టించారు. ఈసారి టాలీవుడ్ సినిమాలు హ‌వా చాటాయి. ముఖ్యంగా అంత‌ర్జాతీయ స్థాయిలో నిర్మించి, అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న బాహుబ‌లికి అవార్డుల పంట పండింది. విజువ‌ల్ వండ‌ర్ గా చెప్పుకునే బాహుబ‌లికి మూడు అవార్డులు ద‌క్కాయి. ఇక తెలుగులో ఉత్త‌మ జాతీయ చిత్రంగా సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఘాజీ సినిమా అవార్డ్ ద‌క్కించుకుంది. ద‌గ్గుబాటి రానా హీరోగా న‌టించిన ఈ సినిమాకు ఉత్త‌మ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయి అవార్డ్ ద‌క్క‌డం ప‌ట్ల ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక బాలీవుడ్ సీనియ‌ర్ హీరో వినోద్ ఖ‌న్నాకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ద‌క్కింది. దివంగ‌త న‌టి శ్రీదేవికి మామ్ సినిమాకి గానూ ఉత్త‌మ న‌టిగా ఎంపిక చేయ‌డం విశేషం.

దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ : వినోద్‌ ఖన్నా

ఉత్తమ చిత్రం : విలేజ్‌ రాక్‌స్టార్స్‌ (అస్సామీ)

హిందీ ఉత్తమ చిత్రం : న్యూటన్‌

జాతీయ ఉత్తమ నటి : శ్రీదేవీ (మామ్‌)

జాతీయ ఉత్తమ నటుడు : రిద్ది సేన్ (మామ్)

ఉత్తమ దర్శకుడు : జయరాజ్‌ (భయానకమ్‌)

ఉత్తమ పోరాట సన్నివేశ చిత్రం : బాహుబలి2

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు : బాహుబలి2

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం : బాహుబలి2

ఉత్తమ నృత్య దర్శకుడు : గణేష్‌ ఆచార్య (టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌కథ)

ఉత్తమ సంగీత దర్శకుడు : ఎఆర్ రెహ్మాన్ (కాట్రు వెలియదై)

ఉత్తమ నేపథ్య సంగీతం : ఎఆర్ రెహ్మాన్( మామ్‌)

ఉత్తమ గాయకుడు : జేసుదాసు

ఉత్తమ గాయని : షా షా తిరుపతి (కాట్రు వెలియదైలోని వాన్‌ వరువన్‌ )

ఉత్తమ తమిళ చిత్రం : టు లెట్‌

ఉత్తమ మరాఠీ చిత్రం : కచ్చా నింబూ

ఉత్తమ కన్నడ చిత్రం : హెబ్బెట్టు రామక్క

ఉత్తమ బెంగాలీ చిత్రం : మయురాక్షి

ఉత్తమ సహాయ నటుడు : ఫహాద్ ఫాసిల్‌ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)

ఉత్తమ సహాయ నటి : దివ్య దత్‌ (ఇరాదా)


Related News

Manchu-Vishnu

శ్రీ రెడ్డి వివాదంలో మంచు విష్ణు ఎంట్రీ

Spread the loveశ్రీరెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. మ‌రింత సెగ రాజుకునేలా క‌నిపిస్తోంది. కొత్త త‌గాదాకు తెర‌లేపుతోంది.Read More

shruthi

బ‌హిరంగంగానే శృతిహాస‌న్…!

Spread the loveసినిమా తార‌ల ప్రైవేట్ లైఫ్ ఎప్పుడూ ఆస‌క్తిగానే ఉంటుంది. అందులోనూ హీరోయిన్ల వ్య‌వ‌హారాలు మ‌రింత చ‌ర్చ‌నీయాంశాల‌వుతాయి. శృతిRead More

 • భ‌ర‌త్ అనే నేను మువీపై ఆస‌క్తిక‌ర రిపోర్ట్
 • శ్రీరెడ్డిపై కొరటాల శివ ఆవేద‌న‌
 • ఎన్టీఆర్ స్థానంలో నాని..
 • చిరంజీవి సైరాకి సై అంటున్న త‌మ‌న్న‌
 • జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ స‌త్తా
 • అత‌డితో మ‌ళ్లీ జ‌త‌గ‌డుతున్న మ‌హేష్
 • శ్రీరెడ్డి సాధించింది…
 • సాయి ప‌ల్ల‌వి హ‌ద్దులు దాటేస్తోందా…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *