Main Menu

ప్రభాస్ కష్టం గురించి అనుష్క..

Spread the love

భాగమతి మరోసారి బాహుబలిని గుర్తు చేశారు. ప్రభాస్ కష్టం గురించి అనుష్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరోసారి తెరమీద రొమాన్స్ కి సిద్దమవుతున్న ఈ జంట ఒకరి గురించి ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా భాగమతి సినిమాకి సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానంగా అనుష్క చేసిన వ్యాఖ్యలు హాట్ టాపికి్ అవుతున్నాయి.

భాగమతి సినిమాలో అనుష్క స్లిమ్ గా కనిపిస్తోంది. అంతగా సన్నబడడానికి కారణాల గురించి ఆమెను ప్రశ్నించగానే ప్రభాస్ ప్రస్తావన వచ్చేసింది. ప్రముఖ హీరోలు విక్రమ్, అమీర్ ఖాన్, బాహుబలి కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డారో తెలుసుకదా అంటూ ఆమె స్పందించారు. ఇక, ‘అపరిచితుడు’, ‘ఐ’ సినిమాల్లో విక్రమ్‌ కష్టాన్ని కళ్లారా చూశారంటూ వ్యాఖ్యానించారు. హిందీలో ఆమిర్‌ కూడా అంతేనని తెలిపారు. ‘గజని’, ‘దంగల్‌’ సినిమాల కోసం బాడీని బాగా కష్టపెట్టేశారంటూ గుర్తుచేశారు. మోహన్‌లాల్‌ విషయానికి వస్తే… 56 ఏళ్ళ వయసులో ‘ఒడియన్‌’ సినిమా కోసం పడిన కష్టం, బరువు తగ్గిన తీరు సూపరంతే అన్నారు. ‘‘మోహన్‌లాల్‌గారు అమేజింగ్‌. 56 ఏళ్ళ వయసులో యువ హీరోలు చేసే రిస్కులు చేశారు. ఆయన్ను చూసి నేనెంతో ఇన్‌స్పైర్‌ అయ్యాను’’ అని అనుష్క పేర్కొన్నారు.

దాంతో ఇప్పుడు అలాంటి హీరోల సరసన ప్రభాస్ ని చేర్చారా..లేక ప్రభాస్ కష్టాన్ని గుర్తు చేయడం ద్వారా ఇంకేమయినా ఆశించారా అన్నది మాత్రం చాలామందికి అర్థంకాని ప్రశ్నగా మిగిలింది.






Related News

సందిగ్ధంలో స్టైలిష్ స్టార్

Spread the loveస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి క్లారిటీ క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల వ‌రుసగా ఫెయిల్యూర్స్ తో ఆయ‌నRead More

మిడ్ నైట్ మ‌సాజ్ కి వ‌స్తాన‌న్నాడు..!!!

Spread the loveబాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా రాధికా ఆప్టే వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా ఉంటుంది. మంచి టాలెంట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *