Main Menu

జేజ‌మ్మ కు మ‌రో గోల్డెన్ ఛాన్స్!

Spread the love

ఇటీవలే బాహుబలి సినిమాతో దేవసేనగా అందరి మన్ననలు అందుకున్న అనుష్కకు, ఆ చిత్రం తరువాత క్రేజ్ మామూలుగా లేదు. అటు గ్లామర్ పాత్రలు, ఇటు డీగ్లామరైజ్డ్ పాత్రలతో ఇప్పటికే అనుష్క తనకంటూ సెపరేట్ ట్రాక్ వేసుకుంది. మహిళా ప్రాధాన్యత కలిగిన పెద్ద చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఆ సమయంలో ఆమె చేసిన బాహుబలి సాధించిన విజయం గురించి చెప్పాల్సిన పనిలేదు. అందులో దేవసేన పాత్ర కీలకం కనుక, ఆమె క్రేజ్ మరింత హైట్స్‌కు చేరింది. దీంతో అనుష్కను దృష్టిలో పెట్టుకునే సోలో హీరోయిన్ చిత్రాలు రూపొందించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే రుద్రమదేవి, అరుంధతి, భాగమతి వంటి చిత్రాల్లో నటించిన అనుష్క చేతికి, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు రాబోతోందని అంటున్నారు.

బాహుబలి స్ఫూర్తితో తమిళ దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న ‘సంఘమిత్ర’ సినిమా కోసం అనుష్కను సంప్రదిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్టులో లీడ్ రోల్ కోసం ఇప్పటికే శృతిహాసన్‌ను ఎంచుకున్నారు. ఫస్ట్ లక్‌లు విడుదలయ్యాయి. సినిమా కోసం వారంపాటు షూటింగ్ కూడా జరిపారు. కానీ ఇంతలో ఏమైందో సినిమానుంచి శృతి తప్పుకుంది. ఇప్పుడు సంఘమిత్ర పాత్ర పోషించగలిగే సామర్థ్యం ఒక్క అనుష్కకే ఉందన్న కథనాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆకస్మికంగా శృతి తప్పుకోవడంతో వీరనారి పాత్ర పోషించగలిగే హీరోయిన్ ఎవరనే సందిగ్ధంలో పడిపోయాడు దర్శకుడు. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలో సంఘమిత్ర పాత్రకు అనుష్క అయితేనే సరైన న్యాయం చేస్తుందన్న యూనిట్ యోచనను దర్శకుడు పరిగణనలోకి తీసుకుంటున్నాడట. మరి ఈ విషయంపై అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి! ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన అనుష్క సంఘమిత్రలో నటిస్తే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.






Related News

ఎన్టీఆర్ లో రాశిఖ‌న్నా రోలేంటో తెలుసా..?

Spread the loveఎన్టీఆర్ బ‌యోపిక్ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అవుతోంది. భారీ తార‌గ‌ణంతో వ‌స్తున్న సినిమా పెద్ద చ‌ర్చ‌కుRead More

పూరీ ద‌ర్శ‌క‌త్వంలో రెండో మ‌న్మ‌థుడు

Spread the loveటాలీవుడ్ లో బ‌యోపిక్ లు, సీక్వెల్స్ సీజ‌న్ జోరుగా ఉంది. దాంతో అంద‌రూ హీరోలు వాటినే అనుస‌రిస్తున్నారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *