Main Menu

ఆ వార్త‌ల‌ను న‌మ్మొద్దు అంటున్న అనుష్క‌

Spread the love

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ అనుష్క చాలాకాలంగా గ్యాప్ తీసుకుంటోంది. 2018 జ‌న‌వ‌రిలో వ‌చ్చిన భాగ‌మ‌తి త‌ర్వాత మ‌ళ్లీ ఈ బ్యూటీ ద‌ర్శ‌నం దొర‌క‌లేదు. రీసెంట్‌గా రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహ వేడుకలో సందడి చేసింది. ఆ వెంట‌నే తాజాగా కోన వెంకట్ బ్యానర్‌లో అనుష్క ఓ చిత్రానికి సైన్ చేసినట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రారంభిస్తామని, సినిమా ఎక్కువ శాతం అమెరికాలోనే షూటింగ్ జరుపుకోనుందని కోన వెంకట్ తెలిపారు.

కేవలం కోన వెంకట్ ప్రకటన ద్వారా మాత్రమే తెలిసిన ఈ సినిమా గురించి అప్పుడే.. సోషల్ మీడియాలో అనేక రకాలుగా వార్తలు మొదలయ్యాయి. ఈ సినిమాలో అనుష్క అలా నటిస్తుంది, ఇలా నటిస్తుందట అంటూ.. వార్తలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అనుష్క ఇందులో దివ్యాంగురాలిగా నటిస్తుందంటూ వచ్చిన వార్తలపై కోన.. ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

నెటిజన్లతో చిట్ చాట్ చేసిన ఆయనను ఓ నెటిజన్.. ‘ఈ సినిమాలో అనుష్క నిజంగా దివ్యాంగురాలిగా నటిస్తుందా? ఆ వార్త నిజమేనా?’ అని అడగడంతో.. ‘మేము అధికారికంగా ప్రకటించే వరకు ఇలాంటి వార్తలు నమ్మవద్దు..’ అంటూ కోన వెంకట్ తెలిపారు. ‘అనుష్క46’ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం థ్రిల్లర్‌గా ఉండబోతోందని, టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని, షూటింగ్ కూడా అతి త్వరలోనే యూఎస్‌లో ప్రారంభమవుతుందని.. ఈ సందర్భంగా కోన తెలిపారు.






Related News

మ‌హేష్ తో అర్జున్ రెడ్డి..!

Spread the loveవిజయ్ దేవరకొండను అర్జున్‌రెడ్డితో ఒక్కసారిగా స్టార్ హీరోను చేసిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ ప్రస్తుతం అదే అర్జున్‌రెడ్డినిRead More

ప్ర‌భాస్ కి ఆమె ఏం పంపిందో తెలుసా?

Spread the loveబాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ లో హీరోయిన్ గా నటిస్తున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *