రాజమౌళికి మరో అవార్డ్

ss rajamouli
Spread the love

అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ఈ ఏడాది ఎస్‌.ఎస్‌.రాజమౌళికి అందజేయనున్నారు. ఈనెల 17న హైదరాబాద్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

అవార్డ్ కమిటీ తరుపున టీ సుబ్బిరామిరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ‘తొమ్మిదేళ్లుగా దేవానంద్‌, షబానా ఆజ్మీ, అంజలి, వైజయంతి మాల, లతా మంగేష్కర్‌, బాలచందర్‌, హేమమాలిని, శ్యాంబెనగల్‌, అమితాబ్‌ బచ్చన్‌ వంటి వారికి ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డులను అందజేశాం. ఒక కోటి రూపాయలను బ్యాంక్‌లో జమ చేసి దాని ద్వారా వచ్చే వడ్డీకి కొంత కలుపుతూ అవార్డ్‌ గ్రహీతలకు ఇస్తున్నాం. నాగేశ్వరరావుగారు చివరి రోజుల్లో కూడా అవార్డులను శాశ్వతంగా ఇవ్వాలని ఆకాంక్షించారు. తండ్రి మాటను గౌరవించి ఆయన కుమారుడు ఈ జాతీయ అవార్డులను గొప్పగా నిర్వహిస్తున్నాడు. 2017 సంవత్సరానికిగాను రాజమౌళికి ఈ అవార్డ్‌ని ఇస్తున్నాం. మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప దర్శకుడు రాజమౌళి. ఒకప్పుడు తెలుగు పరిశ్రమకి అంతగా గుర్తింపు ఉండేది కాదు. ఫస్ట్‌టైమ్‌ అక్కినేని నాగేశ్వరరావుగారు ‘దేవదాసు’ సినిమా చేసిన తర్వాత ఆ సినిమాను చూసి దిలీప్‌ కుమార్‌ వాట్‌ ఎ గ్రేట్‌ స్టార్‌ అని అప్రిషియేట్‌ చేశారు. అప్పట్నుంచీ తెలుగు సినిమాకి ఒక గుర్తింపు, గౌరవం లభించింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌గారు సినిమాలతోనే కాకుండా రాజకీయాల్లో కూడా జాతీయ స్థాయిలో గొప్ప పేరు సంపాదించారు. ఇప్పుడు ‘బాహుబలి’తో రాజమౌళి తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు’ అని అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ ”ఏఎన్‌ఆర్‌ అవార్డ్‌ నాన్నగారి కల. అలాగే అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఫిల్మ్‌ మీడియా నాన్నగారి కల. ఈ రెండు ఒకేసారి జరగడం చాలా సంతోషంగా ఉంది. అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్‌ స్టాండర్డ్స్‌ జాతీయ స్థాయిలో ఉంటాయి. ఈ ఫిల్మ్‌ం ఇనిస్టిట్యూట్‌లో వందమంది స్టూడెంట్స్‌ చదువుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర నుంచే కాకుండా ఇతర రంగాల నుండి కూడా స్టూడెంట్స్‌ వస్తున్నారు ఫిల్మ్‌ స్కూల్‌ను మేం పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. మౌత్‌ టాక్‌తో స్ప్రెడ్‌ అయి ఇంటర్నేషనల్‌ స్థాయిలో ఆ స్టాండర్డ్స్‌ వచ్చేసింది. నాన్నగారి జయంతి రోజైన ఈనెల 20న అవార్డ్‌ ఫంక్షన్‌ చేద్దామని అనుకున్నాం. కానీ వెంకయ్యనాయుడుగారి డేట్‌ ప్రాబ్లెమ్‌ వల్ల చేయడం లేదు. నిజంగా చూస్తే నాన్నగారు చాలా హ్యాపీగా ఫీలయ్యేవారు. మా నాన్నగారితో చెప్పలేని విషయాలు అన్ని సుబ్బరామిరెడ్డిగారితో చెప్పి నాన్నగారిని చెప్పమనేవాడ్ని. అంత రిలేషన్‌ మా ఇద్దరి మధ్య ఉంది. ఆయనకి నా థాంక్స్‌. రాజమౌళితో ఎప్పట్నుంచో పని చేయాలని బాగా ఇష్టం. బట్‌ కుదరలేదు. ‘రాజన్న’ చిత్రానికి కొన్ని షాట్స్‌కి డైరెక్షన్‌ చేశారు. ఆయన డైరెక్షన్‌ చేసిన సీన్స్‌ నా కెరీర్‌లో ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌గా నిలిచాయి. రాజమౌళి, వారి ఫ్యామిలీకి సినిమాలంటే విపరీతమైన ప్యాషన్‌. ఫెంటాస్టిక్‌గా వర్క్‌ చేస్తారు. తెలుగువారందరూ గర్వపడదగ్గ సినిమా ‘బాహుబలి’. కలలు కంటే సరిపోదు. ఆ కలల్ని నిజం చేసుకోవాలి. అది చాలా కష్టం. రాజమౌళి ఇక్కడ డ్రీమ్‌ చేయలేదు. అక్కడెక్కడో ఉండి కలలు కన్నారు. ఎవరూ ఊహించనంతగా ఆ సినిమా తీశారు. ఆ టీమ్‌ని ఎలా అప్రిషియేట్‌ చేయాలో ఎవరికీ తెలియక అందరూ ‘బాహుబలి’ రాజమౌళి అంటున్నారు” అని అన్నారు.


Related News

poonam1-1

త్రివిక్రమ్ ని టార్గెట్ చేసిన పూనమ్ కౌర్!

Spread the loveటాలీవుడ్ లో దర్శకులపై హీరోయిన్ల ఎటాక్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే శ్రీరెడ్డి వ్యవహారం అందరికీ తెలిసిందే. శేఖర్Read More

deepika

ముహూర్తం పెట్టేసుకున్న దీపిక

Spread the loveబాలీవుడ్ లవర్స్ ఒక్కొక్కరుగా పెళ్లిపీటలు ఎక్కేస్తున్నారు. తాజాగా అదే పరంపరలో దీపిక పడుకొనే కూడా చేరబోతోందని సమాచారం.Read More

 • జక్కన్న మల్టీ స్టారర్ అప్ డేట్స్
 • రవితేజకు హీరోయిన్ షాక్
 • ప్రియుడుతో కలిసి నయన్ హల్ చల్
 • మల్టీ స్టారర్ కీర్తి
 • క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్
 • త్రిష పెళ్లికి తయార్..!
 • ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ రెడీ
 • ఉదయ్ కిరణ్ బయోపిక్ ‘కాబోయిన అల్లుడు’
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *