Main Menu

అనసూయకు షాక్

Spread the love

టీవీ యాంకర్ నుంచి ఇప్పుడు వెండితెర మీద హల్ చల్ నుంచి అనసూయకి షాక్ తగిలింది. అనూహ్య నిర్ణయం తీసుకుంది. నెటిజన్ల తాకిడితో తల్లడిల్లి చివరకు సోషల్ మీడియా నుంచి ఉపసంహరించుకుంది. తన ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లను క్లోజ్ చేసుకుంది. తాజాగా తార్నాకలో జరిగిన ఘటన తర్వాత ఆమె మీద నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అనసూయ తీరుని అంతా ముక్తకంఠంతో ఖండించారు. దాంతో చివరకు ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. అయినా చాలా మంది వెనక్కి తగ్గడం లేదు. చివరకు ఈ హఠాన్పరిణామాలకు తల్లడిల్లిన అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్లన్నీ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది.

హైదరాబాద్ తార్నాకకు కారులో వెళ్తుండగా.. ఓ బాలుడు సెల్ఫీ తీసుకునేందుకు రావడంతో.. అసహనానికి గురైన అనసూయ.. బాలుడి ఫోన్‌ను నేలకేసి కొట్టింది. దీనిపై సోషల్ మీడియాలో రెండు రోజులుగా వైరల్ అవుతోంది. ఈ దెబ్బకు అనసూయ తల్లడిల్లిపోవాల్సి వచ్చింది. చివరకు చాలాకాలంగా సోషల్ మీడియాలో నిత్యం కనిపించే అనసూయ ఇక దర్శనాలకు దూరం అయిపోయింది.






Related News

ఎన్టీఆర్ లో రాశిఖ‌న్నా రోలేంటో తెలుసా..?

Spread the loveఎన్టీఆర్ బ‌యోపిక్ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అవుతోంది. భారీ తార‌గ‌ణంతో వ‌స్తున్న సినిమా పెద్ద చ‌ర్చ‌కుRead More

పూరీ ద‌ర్శ‌క‌త్వంలో రెండో మ‌న్మ‌థుడు

Spread the loveటాలీవుడ్ లో బ‌యోపిక్ లు, సీక్వెల్స్ సీజ‌న్ జోరుగా ఉంది. దాంతో అంద‌రూ హీరోలు వాటినే అనుస‌రిస్తున్నారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *