Main Menu

సైరా సినిమా నుంచి బిగ్ వికెట్ డౌన్

Spread the love

చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదొక ప్రచారం జరుగుతూనే ఉంది. అది నిజమవుతూనే ఉంది. సంగీత దర్శకుడు రెహమాన్‌, బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ ఈ సినిమా నుంచి తప్పుకుంటారని మొదట ప్రచారం జరిగింది. అది నిజమైంది. ఇప్పుడు బాలీవుడ్‌ బిగ్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఆయన స్థానంలో మరో నటుడి కోసం చిత్రబృందం అన్వేషిస్తుందని ఈ రూమర్‌ సారాంశం. ఎప్పుడూ లేనిది ఈ సారి మాత్రం రూమర్‌పై చిత్రబృందం స్పందించింది.’సైరా’ టీమ్‌లో ఎలాంటి మార్పులూ లేవని, అమితాబ్‌ బచ్చన్‌ టీమ్‌లో ఉన్నారని, ఆయన తప్పుకున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చింది. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. సంక్రాంతికి తీసుకున్న సుదీర్ఘ సెలవు ఈనెలలో ముగయనుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌తో కూడిన పార్ట్సును ఇప్పుడు చిత్రీకరించనున్నారు. దాని పని మీద చిరంజీవి చైనా వెళ్లారట. అందుకోసమే గెడ్డాలు, మీసాలు కూడా తీశారు. ఆ విషయం చిరంజీవే గతంలో చెప్పారు కూడా.






Related News

ఎన్టీఆర్ లో రాశిఖ‌న్నా రోలేంటో తెలుసా..?

Spread the loveఎన్టీఆర్ బ‌యోపిక్ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అవుతోంది. భారీ తార‌గ‌ణంతో వ‌స్తున్న సినిమా పెద్ద చ‌ర్చ‌కుRead More

పూరీ ద‌ర్శ‌క‌త్వంలో రెండో మ‌న్మ‌థుడు

Spread the loveటాలీవుడ్ లో బ‌యోపిక్ లు, సీక్వెల్స్ సీజ‌న్ జోరుగా ఉంది. దాంతో అంద‌రూ హీరోలు వాటినే అనుస‌రిస్తున్నారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *