Main Menu

మ‌హేష్ వ్యాపారం ప్రారంభ‌మ‌య్యింది..!

Spread the love

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కొత్త రంగంలో అడుగుపెట్టారు. సినిమాల‌కు అనుబంధ‌మే అయిన‌ప్ప‌టికీ న‌యా వ్యాపారంలో పెట్టిన అడుగు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమాల్లో న‌టించ‌డం, నిర్మాణం వ‌ర‌కూ మాత్ర‌మే ప‌రిమిత‌మ‌యిన మ‌హేష్ బాబు ఈసారి థియేట‌ర్ల వ్యాపారంలో అడుగుపెట్టారు. అయితే ఆశ్చ‌ర్యంగా సినిమా నిర్మాణంలో ఎంబీ ప్రొడ‌క్ష‌న్ అంటూ త‌న పేరుతోనే సంస్థ ప్రారంభించిన మ‌హేష్ బాబు, త‌న థియేట‌ర్ల‌కు కూడా ఏఎంబీ అంటూ త‌న పేరునే ఉప‌యోగించ‌డం విశేషంగా చెప్ప‌వ‌చ్చు.

తాజాగా హైద‌రాబాద్ లో ఏఎంబీ సినిమాస్ పేరుతో ఓ కాంప్లెక్స్ ప్రారంభించారు. మొత్తం 7 స్క్రీన్ల‌తో ఉన్న థియేట‌ర్ ను తాజాగా ప్రారంభించారు. ఆసియ‌న్ గ్రూప్ తో క‌లిసి వీటిని నిర్మించారు. ఆసియ‌న్ గ్రూప్ కి చెందిన నారాయ‌ణ్ దాస్ తో క‌లిసి మ‌హేష్ కుటుంబం ఈ ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు. తొలిసినిమాగా రోబో 2 పాయింట్ ఓ ప్ర‌ద‌ర్శించారు. త్రీ డీ సినిమాను అంతా ఆనందించారు. కొత్త అనుభూతి క‌లిగించేలా సినిమా కాంప్లెక్స్ నిర్మించిన మ‌హేష్ కి ప‌లువురు శుభాకాంక్ష‌ల‌తో పాటు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *