అయ్యో..అల్లు అర్జున్ మీద దాడి…!

allu arjun
Spread the love

టాలీవుడ్ స్ట‌యిలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్య‌వ‌హారం ఇటీవ‌ల హాట్ టాపిక్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం మోడీ విష‌యంలో ఆయ‌న్ని నెటిజ‌న్లు ట్రోల్ చేశారు. ట్విట్ట‌ర్ సాక్షిగా ఎదురుదాడికి దిగారు. ఇక తాజాగా మ‌రోసారి అలాంటి ప‌రిస్థితి వ‌చ్చింది. ఈసారి త‌న సినిమా డైలాగ్ బ‌న్నీకి త‌ల‌నొప్పి తెచ్చిపెడుతోంది.

అల్లు అర్జున్ లేటెస్ట్ మువీ నా పేరు సూర్య‌.నా ఇల్లు ఇండియా రిలీజ్ కి సిద్దం అవుతోంది. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ న‌టించిన సినిమా టీజ‌ర్‌ తాజాగా విడుద‌లయ్యింది. అభిమానుల నుంచి మంచి ఆద‌ర‌ణ వ‌స్తోంది. అయితే ఈ టీజ‌ర్ లో ఉన్న ఓ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగే బ‌న్నీని విమ‌ర్శ‌ల పాలుచేస్తోంది.

`నార్త్ ఇండియా.. సౌత్ ఇండియా.. ఇలా అన్ని ఇండియాలు లేవురా. మ‌న‌కి ఒక్క‌టే ఇండియా` అంటూ సాగే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌ను బ‌న్నీ చెప్పాడు. అయితే బ‌న్నీ ట్విట‌ర్ ప్రోఫైల్‌లో మాత్రం త‌న‌ను తాను సౌతిండియా యాక్ట‌ర్ అంటూ ప‌రిచ‌యం చేసుకున్నాడు. దీనిపై ప‌లువురు మండిప‌డుతున్నారు. బ‌న్నీ తీరును త‌ప్పుబ‌డుతున్నారు. కామెంట్ల‌తో దాడికి దిగుతున్నారు. ట్విట్ట‌ర్ లో వారం వ్య‌వ‌ధిలో రెండోసారి ఆయ‌న ట్రోల్స్ చేతికి చిక్కిన‌ట్టు క‌నిపిస్తోంది. దేశ‌భ‌క్తి డైలాగుల‌న్నీ సినిమాల వ‌ర‌కేనా? వ్యక్తిగ‌త జీవితంలో ఆచ‌రించేది ఉండదా?` అంటూ కొంత‌మంది కామెంట్లు చేస్తుంటే.. మ‌రికొంత మంది మాత్రం `బ‌న్నీ రియ‌ల్ హీరో కాదు.. రీల్ హీరో మాత్ర‌మే` అంటూ కామెంట్లు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో కావేరీ ఉద్య‌మంలో త‌మిళ న‌టుల తీరుని, హోదా ఉద్య‌మంలో తెలుగు తార‌ల వైఖ‌రిని పోల్చి ప‌లువురు ఇదేనా దేశ‌భ‌క్తి అంటూ ఎండ‌గ‌డుతున్నారు. దాంతో ఇది అల్లు అర్జున్ కి పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌న‌డంలో సందేహం లేదు.


Related News

tollywood

చానెళ్ల‌కు చెక్ పెట్టాల‌ని హీరోల నిర్ణ‌యం!

Spread the loveటాలీవుడ్ టాప్ హీరోలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. న్యూస్ చానెళ్ల వ్య‌వ‌హారంతో తీవ్రంగా క‌ల‌త చెందుతున్న స్టార్లంతాRead More

mahesh babu

మ‌హేష్ ఫిక్స‌య్యాడు..

Spread the loveభ‌ర‌త్ అనే నేను విజ‌యంతో ఊపుమీద‌కొచ్చిన మ‌హేష్ బాబు త‌న నెక్ట్స్ మువీని క‌న్ఫ‌ర్మ్ చేశారు. మ‌హేష్Read More

 • శ్రీ రెడ్డి వివాదంలో మంచు విష్ణు ఎంట్రీ
 • బ‌హిరంగంగానే శృతిహాస‌న్…!
 • భ‌ర‌త్ అనే నేను మువీపై ఆస‌క్తిక‌ర రిపోర్ట్
 • శ్రీరెడ్డిపై కొరటాల శివ ఆవేద‌న‌
 • ఎన్టీఆర్ స్థానంలో నాని..
 • చిరంజీవి సైరాకి సై అంటున్న త‌మ‌న్న‌
 • జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ స‌త్తా
 • అత‌డితో మ‌ళ్లీ జ‌త‌గ‌డుతున్న మ‌హేష్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *