‘సైరా’ అంటున్న అల్లు అర్జున్

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం సినిమాలో బన్నీ నిజంగానే కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. చిత్రంలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్లు నటిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నటిస్తే, సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం లేకపోలేదు. చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్న చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
Related News

‘సైరా’ అంటున్న అల్లు అర్జున్
Spread the loveమెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.Read More

ఆమెను దేవుడే పంపాడంటున్న విశాల్
Spread the loveటాలీవుడ్ నుంచి వెళ్లి కోలీవుడ్ లో కీర్తి గడించిన తెలుగు బిడ్డ విశాల్ చివరకు తెలుగు అమ్మాయినేRead More