రమ్యకృష్ణ ని అల్లు అరవింద్ అలా ఎందుకున్నారో?

ramkakrishna_6584
Spread the love

శివగామి సినిమాతో శివాలెత్తిన రమ్యకృష్ణ సినీ ఇండస్ట్రీలో తానేంటో మరోసారి నిరూపించుకుంది. తన నటనా సామర్ధ్యం చాటిచెప్పింది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి, మెప్పించగలిగే సామర్ధ్యం తనకుందని చాటి చెప్పింది. ఒకప్పుడు హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఆమె.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మెప్పిస్తున్న తీరు చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

అలాంటి రమ్యకృష్ణపై నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్’ సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్దమైంది. సూర్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో ప్రిరిలీజ్ వేడుక నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్ ఎవరూ ఊహించని విధంగా రమ్యకృష్ణపై కామెంట్స్ చేశారు.’గ్యాంగ్’ సినిమా ట్రైలర్ లో సీరియస్ లుక్స్ తో రమ్యకృష్ణ ఆకట్టుకుంది. దీనిపై స్పందించిన అల్లు అరవింద్.. ‘రమ్య కృష్ణ నా హీరోయిన్’ అని కామెంట్ చేశారు. అరవింద్ కామెంట్‌తో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. స్టేజీపై ఉన్న ఇతర సెలబ్రిటీలు కూడా నవ్వేశారు. అసలు తన హీరోయిన్ రమ్యకృష్ణ అంటూ పేర్కొనడం ఆశ్చర్యమేనని అంతా గుసగుసలాడుకోవడం విశేషం.


Related News

DY4IkDSW4AE8pbm

మెగా ఫ్యామిలీ లుంగీల క‌థ తెలుసా..!

Spread the loveమెగాస్టార్ ఫ్యామిలీ లుంగీల వెంట‌ప‌డింది. అయితే అది ఇప్పుడిప్పుడే కాదండోయ్..చిరంజీవి కాలం నుంచి ఆ స‌ర‌దా ఉంది.Read More

Rakul-Preet-Singh-Images

ర‌కుల్ ఆయ‌న‌పై మ‌న‌సు ప‌డింది…!

Spread the loveటాలీవుడ్ లో రెండేళ్ల క్రితం ర‌కుల్ హ‌వా క‌నిపించింది. కానీ అంత‌లోనే ఆశ‌లు ఆవిర‌య్యాయి. వెంక‌టాద్రి ఎక్స్Read More

 • రాజ‌మౌళి కోసం స్పీడ్ పెంచిన త్రివిక్ర‌మ్
 • మెగాస్టార్ ముహూర్తం పెట్టేశాడు…
 • పూజాగానంలో టాలీవుడ్
 • గొల్ల‌భామ‌పై క్లారిటీ
 • చీటింగ్ కేసులో మ‌రో హీరోయిన్
 • ప్రెసిడెంట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ బ్యూటీ
 • చైనా వైపు చిరంజీవి చూపు
 • అన‌సూయ బ్యాక్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *