Main Menu

చిరుకి కాదని, పీకేకి ఓకే చెప్పిన చంద్రబాబు

Spread the love

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి. ఆయన 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150కి విశేషమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎదురుచూసిన సమయంలో చిరంజీవి నేరుగా ప్రయత్నించినా చంద్రబాబు ససేమీరా అన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అదనపు షోలకు గానీ, టిక్కెట్ రేట్ల పెంపుదల విషయంలో గానీ చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం కూడా ఆ సినిమా యూటిన్ చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. విజయవాడలో తగిన గ్రౌండ్ అనుమతులు ఇవ్వకుండా ఆడ్డంకులు పెట్టడంతో చిరంజీవి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం అలాంటి సమస్యలు లేవు. సినిమా యధేశ్ఛగా 8 రోజుల పాటు రోజూ ఏడెనిమిది షోలు వేసుకోవడానికి తగ్గట్టుగా ప్రభుత్వం 21 గంటల అనుమతినిచ్చింది. టిక్కెట్ల రేట్లు యధేశ్ఛగా పెంచేశారు. దాంతో సినిమా వసూళ్ల వ్యవహారానికి ఢోకా లేదు. లాభాల పంట ఖాయం అని చెప్పవచ్చు. మొత్తంగా పవన్ సినిమా మంచి ఫలితం ఆశిస్తుందని అంతా భావించడానికి తగ్గట్టుగా చంద్రబాబు ప్రభుత్వం రెడ్ కార్పెట్ సిద్ధం చేయడం విశేషం.

అదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అన్నయ్యకు ఆటంకాలు, తమ్ముడికి దాసోహాలు అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించడం వెనుక చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలనే పరమావధిగా భావిస్తున్నారు. చిరంజీవి కాంగ్రెస్ నేతగా , టీడీపీకి వ్యతిరేక పక్షంలో ఉండడం, పవన్ కళ్యాణ్ జనసేనానిగా చంద్రబాబుకి మిత్రపక్షంగా ఉండడంతోనే ఇలాంటి అవకాశాలు దక్కినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం పూర్తిగా ఏకపక్షంగా అయిన వాళ్లకు ఒకలా, కాని వాళ్లకు మరోలా వ్యవహరిస్తోందనడానికి ఈ సినిమాల వ్యవహారం ఓ ఉదాహరణగా ఉందన్నది పరిశీలకుల అభిప్రాయం.






Related News

సందిగ్ధంలో స్టైలిష్ స్టార్

Spread the loveస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి క్లారిటీ క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల వ‌రుసగా ఫెయిల్యూర్స్ తో ఆయ‌నRead More

మిడ్ నైట్ మ‌సాజ్ కి వ‌స్తాన‌న్నాడు..!!!

Spread the loveబాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా రాధికా ఆప్టే వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా ఉంటుంది. మంచి టాలెంట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *