Main Menu

ఈ ఏడాది టాప్ మువీస్ ఇవే..!

Spread the love

టాలీవుడ్ సినిమాల వ‌సూళ్ల‌లో యూఎస్ కీల‌కంగా మారింది. ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్ల ఆధారంగా సినిమా నిర్మాత‌ల ఆశ‌లు పండుతున్నాయా..ఎండుతున్నాయా అన్న‌ది ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక 2018 సంవ‌త్స‌రానికి సంబంధించిన యూఎస్ లో అత్య‌ధిక గ్రాస్ వ‌సూళ్ల చేసిన సినిమా లిస్ట్ ఆస‌క్తిక‌రంగా ఉంది. ముఖ్యంగా సీనియ‌ర్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హావా ఓవ‌ర్సీస్ లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టాప్ 10లో అత‌డి రెండు సినిమాలు చేరాయి. చివ‌రిలో వ‌చ్చిన 2 పాయింట్ 0 వ‌సూళ్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. అయినా ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్ల‌తో టాప్ లిస్టులో చేరింది. ద్విభాషా చిత్రం కావ‌డం, పాజిటివ్ టాక్ రావ‌డంతో రోబో సినిమా బాక్సాఫీస్ గ‌ల‌గ‌ల‌లు బ‌లంగా వినిపించాయ‌న్న‌ది ప‌రిశీల‌కుల అంచ‌నా.

ఇక రంగ‌స్థ‌లం సినిమా ద్వారా రామ్ చ‌ర‌ణ్ స‌త్తా చాటగా, భ‌ర‌త్ అను నేను ద్వారా మ‌హేష్ మూడో స్థానంలో నిలిచారు. మ‌హాన‌టి, గీతాగోవిందం వాటిని అనుస‌రించ‌గా ఎన్టీఆర్ సినిమా అర‌వింద స‌మేత ఆరో స్థానంతో స‌రిపెట్టుకుంది.

ఇక టాప్ 10 లిస్ట్ ఇదిగో..

1 2.0
2 రంగ‌స్థ‌లం
3 భ‌ర‌త్ అనే నేను
4 మ‌హాన‌టి
5 గీతాగోవిందం
6 అర‌వింద‌స‌మేత‌
7 అజ్ఞాత‌వాసి
8 కాలా
9 భాగ‌మ‌తి
10 తొలి ప్రేమ‌






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *