Main Menu

పవన్ వెరీ స్పెషల్ పర్సన్

Spread the love

‘పవన్ కళ్యాణ్‌ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనతో పనిచేయడం మరిచిపోలేని అనుభూతి’ అని అంటోంది అను ఇమ్మాన్యుయెల్‌. ‘మజ్ను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అను. ఆ తర్వాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్‌’ చిత్రాలతో మెప్పించింది. తాజాగా పవన్‌ కళ్యాణ్‌తో నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా పవన్‌తో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ గురించి అను చెబుతూ, ‘పవన్‌ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అంతేకాదు మంచి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌. సెట్స్‌లో చాలా సరదాగా, రిలాక్స్‌గా ఉంటారు. ఆర్టిస్టులను ప్రోత్సహిస్తారు. ఆయనతో పనిచేసిన టైమ్‌ చాలా గొప్పదిగా భావిస్తున్నా’ అని తెలిపింది. అను ప్రస్తుతం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రాల్లో నటిస్తోంది






Related News

సందిగ్ధంలో స్టైలిష్ స్టార్

Spread the loveస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి క్లారిటీ క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల వ‌రుసగా ఫెయిల్యూర్స్ తో ఆయ‌నRead More

మిడ్ నైట్ మ‌సాజ్ కి వ‌స్తాన‌న్నాడు..!!!

Spread the loveబాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా రాధికా ఆప్టే వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా ఉంటుంది. మంచి టాలెంట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *