నాని కూడా అది మొదలెట్టేశాడు..

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియో విడుదలకు సంబందించి,ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది.సినిమా లోని అన్ని పాటలూ ఒకేసారి విడుదల చేస్తే సినిమాకు సరిగ్గా ప్రమోషన్ జరగదనో ఏమో ఒక్కో పాటను విడుదల చేస్తూ సరికొత్త పబ్లిసిటీ స్టంట్‌కు తెరలేపారు టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు. ఈ ఒక్కో పాట సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారో కానీ చాలామంది హీరోలు ఈ మధ్య ఇదే ఫాలో అవుతున్నారు. నేచులర్ స్టార్ నాని కూడా దీన్నే మార్గంగా ఎంచుకున్నాడు.
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను లోకల్’. దిల్‌రాజు నిర్మాతగా, దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాట ‘నెక్ట్స్ ఏంటి’ అనే బాణీలో సాగుతుందట. ఈ పాటను జనవరి 6న సాయంత్రం 6గంటలకు యూట్యూబ్‌లో అప్లోడ్ చేయనున్నట్లు నాని తన ఫేస్బుక్ పేజ్ ద్వారా తెలియజేశాడు. చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 సినిమా పాటలు కూడా ఒక్కొక్కటిగా యూట్యూబ్ ద్వారా విడుదలైన సంగతి తెలిసిందే.
Related News

శ్రీ రెడ్డి వివాదంలో మంచు విష్ణు ఎంట్రీ
Spread the loveశ్రీరెడ్డి వ్యవహారం ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. మరింత సెగ రాజుకునేలా కనిపిస్తోంది. కొత్త తగాదాకు తెరలేపుతోంది.Read More

బహిరంగంగానే శృతిహాసన్…!
Spread the love6Sharesసినిమా తారల ప్రైవేట్ లైఫ్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అందులోనూ హీరోయిన్ల వ్యవహారాలు మరింత చర్చనీయాంశాలవుతాయి. శృతిRead More