గౌతమీపుత్రుడి కోసం ‘బాహుబలి’ టీం…..

BAAHU
Spread the love

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విజయవంతంగా దూసుకెళుతోంది. కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమా డిస్ట్రిబ్యూటర్లు కలెక్షన్ల పరంగా సంతోషంగా ఉన్నారు. దీంతో సినిమాను జనాల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే బాలయ్య, డైరెక్టర్ క్రిష్‌, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌లతో కలిసి ఇంటర్వ్యూలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి దర్శక ధీరుడు రాజమౌళి, భల్లాలదేవుడు రానా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పండుగ అనంతరం కలెక్షన్లు పడిపోకుండా బాలకృష్ణతో రానా, క్రిష్‌తో జక్కన్నల ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయట. ఇప్పటికే ఓ చానల్ ఆ ఇంటర్వ్యూలను నిర్వహించిందట. ఈ వీకెండ్‌లోనే ఆ చానల్ సదరు ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుందని టాక్. బాహుబలి ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి, భల్లాలదేవుడు రానాలతో ఈ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తే.. వాటిని చాలా మంది చూస్తారని, సినిమా చూడని వారిని చూసేలా ప్రేరేపిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక, ఓ భారీ సెట్‌లో శాతకర్ణి కోసం పనిచేసిన టీమ్ మొత్తంతో కలిసి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని సదరు చానల్ టెలీకాస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణను శాతకర్ణి యూనిట్ ఆకాశానికెత్తేసింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *