Main Menu

వైసీపీని క‌ట్ట‌డి చేసే వ్యూహంలో టీడీపీ అడుగులు

Spread the love

ప్ర‌ధాన స్ర‌వంతి మీడియాలో టీడీపీదే ఆధిప‌త్యం.ఇ టీవ‌ల కొన్ని చానెళ్ల‌లో మార్పులు సంభ‌వించినా తెలుగుదేశానికి పెద్ద‌గా ఢోకా లేద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం అధికార పార్టీకి ఆటంకాలు త‌ప్పడం లేదు. ప్ర‌జాగ్ర‌హాన్ని ప్రస్ఫుటించేలా విప‌క్ష కార్య‌క‌ర్త‌ల పోస్టుల‌తో అధికార పార్టీ హ‌వాకు అడ్డుక‌ట్ట ప‌డింది. 2014కి ముందు పూర్తిగా టీడీపీ ఆధిప‌త్యం క‌నిపించిన సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఆపార్టీ బాగా వెనుక‌బ‌డింద‌నే చెప్ప‌వ‌చ్చు.

దాంతో వైసీపీని క‌ట్ట‌డి చేసేందుకు పాల‌క‌ప‌క్షం ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌ను కేసుల పేరుతో జైళ్ల‌కు కూడా త‌ర‌లించింది. అయినా వైసీపీ శ్రేణులు త‌గ్గ‌డం లేదు. పైగా అత్యుత్సాహంతో వ్య‌క్తిగ‌త నింద‌లతో కూడా పోస్టులు చేయ‌డం టీడీపీకి అవ‌కాశంగా మారింది. పోలీసుల‌ను ప్ర‌యోగించి వారిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అలాంటి క్ర‌మంలో తాజాగా 18మందిపై కేసులు నమోద‌య్యాయి.

ఓవైపు మాజీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ని విచార‌ణ పేరుతో గుంటూరు తిప్పుతున్న పోలీసులు మ‌రో వైపు 18మంది వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేసేందుకు రంగంలో దిగారు. ఇప్ప‌టికే ప‌లువురు అరెస్ట్ అయ్యారు. వారితో పాటుగా ప‌లువురు యువ‌కుల త‌ల్లిదండ్రుల‌ను కూడా పోలీస్ ్టేష‌న్ల‌కు త‌ర‌లించ‌డం విశేషంగా మారింది. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీలో పెరిగిన అస‌హ‌నానికి నిద‌ర్శ‌నంగా వ‌ల్లిస్తున్నారు.

ఓవైపు జ‌గ‌న్ త‌ల్లిని, చెల్లిని నిందించిన ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర‌ప్ర‌సాద్ మీద చ‌ర్య‌లు తీసుకోకుండా, ఆయ‌న ఫిర్యాదుతో ఇత‌రుల మీద చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, నింద‌ల‌ను స‌హించేది లేద‌ని, అంద‌రిమీదా చ‌ర్య‌లుంటాయ‌ని చెబుతున్నారు.






Related News

మీటూ ఎఫెక్ట్: ఇద్ద‌రు ఎడిట‌ర్ల‌పై వేటు

Spread the love3Sharesమాజీ పత్రికా సంపాదకులు ఎంజె అక్బర్‌, తరుణ్‌ తేజ్‌పాల్‌ను బుధవారం ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఇజిఐ)Read More

చ‌ర్చ‌నీయాంశంగా మారిన టీవీ9 స‌ర్వే

Spread the love11Sharesప్ర‌స్తుతం ఎన్నిక‌ల పోరులో ప్ర‌తీ అవ‌కాశం కూడా వినియోగించుకునేందుకు పార్టీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. మీడియా అందుకు తందానRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *