Main Menu

ఏపీలో వైసీపీ టాప్

Spread the love

ఏపీలో వైసీపీ టాప్ లో నిలుస్తోంది. టీడీపీ తరుపున అధికారికంగా కోట్లు వెచ్చిస్తున్నా విపక్షమే ముందంజలో నిలుస్తోంది. అధికార తెలుగుదేశానికి తలనొప్పిగా తయారయ్యింది. పాలకపక్షం ఎన్ని ప్రయత్నాలు చేసినా పై చేయి సాధించలేకపోతోంది. తాజాగా జనసేన కూడా శత్రుఘ్ని పేరుతో ఓ బ్రుందాన్ని సిద్ధం చేసుకుని సమరం సాగిస్తుండడంతో సోషల్ మీడియాలో టీడీపీ వెనకపట్టు పట్టాల్సి వస్తోంది. అదే సమయంలో వైసీపీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. జాతీయ స్థాయిలో ఆర్ఎస్ఎస్ సహకారంతో బీజేపీ సోషల్ మీడియా వినియోగంలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో కాంగ్రెస్ చాలా పుంజుకుంది. ముఖ్యంగా కన్నడ నటి రమ్యకు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించిన తర్వాత కొంత క్రియేటివ్ గా దూసుకొస్తోంది. అది బీజేపీకి కంటగింపుగా మారింది. సోషల్ మీడియాను ఎదుర్కోవడం గురించి తీవ్రంగానే శోధిస్తోంది.

అదే సమయంలో గత ఎన్నికల నాటికి ఫుల్ జోష్ లో కనిపించిన ఆమ్ ఆద్మీ జోరు ఇప్పుడు కొంత తగ్గింది. అయినా జాతీయస్థాయిలో మూడో స్థానంలో ఆప్ సోషల్ మీడియా విభాగం కనిపిస్తోంది. ఆ తర్వాత వైసీపీదే హవా అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్సాప్ నిర్వహణలో వైసీపీ గడిచిన నాలుగేళ్లుగా విశేషంగా ప్రయత్నిస్తోంది. అది చంద్రబాబు సహించలేని స్థాయికి చేరింది. అడ్డుకోవడం కోసం కొన్నిసార్లు కేసుల పేరుతో నిర్బంధం కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ఇంటూరి రవికిరణ్, ఇప్పాల రవీంద్ర వంటి కొందరిని అరెస్టులు చేసి జైలు పాలుజేసినా వైసీపీ సోషల్ మీడియా జోరు తగ్గలేదు.

ఇక తాజాగా వైసీపీకి తోడుగా జనసేన కూడా ముందుకొచ్చింది. జనసేన సోషల్ మీడియా విభాగం కూడా కొంత విన్నూత్నంగా ప్రయత్నాలు చేస్తోంది. దాంతో సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం స్పష్టంగా గోచరిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు కూడా ట్విట్టర్ లో కొంత సమయం కేటాయిస్తున్నారు. ఆయన సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు ప్రభుత్వం తరుపున కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అయినా ఫలితాలు ఆశించినట్టుగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి విపక్షానిదే పై చేయి. అందులో వైసీపీ టాప్ లో ఉంది.






Related News

మిడిమిడి మీడియా అంటే అదే..!

Spread the loveఇప్ప‌టికే అంద‌రికీ అర్థ‌మ‌య్యింది. మీడియా అంటే నిష్ఫ‌క్ష‌వార్త‌లు అందిస్తుంద‌ని న‌మ్మిన త‌రం నుంచి మీడియా అంటే ఆర్థికRead More

టీవీ9 అమ్మ‌కంపై త‌గాదా

Spread the loveతెలుగులో టీఆర్పీ ప‌రంగా టాప్ లో నిలిచే టీవీ9 చానెల్ అమ్మ‌కం పెద్ద త‌గాదాగా మారుతోంది. ఆర్థికRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *