వైసీపీ పరువు తీస్తున్న సోషల్ మీడియా

1736_ysrcp
Spread the love

సోషల్ మీడియాలో నిత్యం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం చాలా సహజంగా మారింది. అందులోనూ పార్టీల కార్యకర్తలయితే మరో అడుగు ముందుకేస్తుంటారు. బూతులు, అసభ్య పదాలతో అనునిత్యం హల్ చల్ చేస్తుంటారు. ఆఖరికి కేసులు పెట్టి జైలు పాలయిన తర్వాత కూడా కొందరిలో పెద్దగా మార్పు కనిపించదు. అలాంటి వారిలో ఇప్పాల రవీంద్ర ఒకరు. ఆయన వైసీపీ సోషల్ మీడియా విభాగంలో కీలక పాత్రధారి. నిత్యం పోస్టులతో ఎదురుదాడి చేస్తూ టీడీపీ శ్రేణులకు కంట్లో నలుసుగా మారిన వ్యక్తి. అయితే ఆయన తీరు చివరకు ప్రత్యర్థులతో పాటు పార్టీలోని వ్యక్తుల మీదకు మళ్లింది.

తాజాగా బెంగళూరు నుంచి పనిచేస్తున్న వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ లో వచ్చిన వివాదంతో ఇప్పుడు ఫేస్ బుక్ వాల్ మీద పడ్డారు. ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారు. పోస్టులు పెట్టుకుంంటూ విమర్శలు చేసుకుంటున్నారు. ఏకంగా తన మీద దాడి చేయడానికి శ్యామ్ రెడ్డి అనే వ్యక్తి ప్రయత్నం చేశాడని ఇప్పాల రవీంద్ర ఆరోపిస్తుంటే, రవీంద్ర అనే వ్యక్తే టీడీపీకి కోవర్ట్ గా పనిచేస్తున్నారనే ప్రచారం ఆయన వ్యతిరేకులు చేస్తున్నారు.

దాంతో రాష్ట్రంంలోని అనేక ప్రాంతాల్లో వైసీపీలో కనిపిస్తున్న విబేధాలు చివరకు ఇప్పుడు పార్టీ పరువు తీసే స్థాయికి చేరుకుంటున్నాయి. సోషల్ మీడియాలో విబేధాలు విస్త్రుతమవుతూ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. నిత్యం తిట్టడానికి అలవాటు పడి చివరకు ఇప్పుడు వారిలోనే ఒకరినొకరు తిట్టుకునే స్థాయికి ఎదిగినట్టు కనిపిస్తోంది. పార్టీకి మాత్రం ఇది చేటు చేస్తుందనడంలో సందేహం లేదు.






Related News

amaravati design

అమరావతి ఆశలు నీరుగార్చేసిన చానెల్

Spread the loveఏపీ రాజధానిలో రకరకాల నగరాల నిర్మాణం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించారు కూడా. పరిపాలన అంతాRead More

tv channels ratings

‘కత్తి’ చుట్టూ మీడియా: కథ నడిపిందెవరు?

Spread the loveఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. కత్తి మహేష్ కి, పవన్ కళ్యాణ్ అభిమానులకు మొదలయిన వార్ మరింత ముదరడంలోRead More

  • గజల్స్ గలీజు వెనుక మీడియా చానెల్స్ యజమాని
  • తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్
  • ఇంగ్లీష్ చానెల్ తో టీవీ5 టైఅప్
  • వైసీపీ పరువు తీస్తున్న సోషల్ మీడియా
  • సోషల్ మీడియా సాయంతో ముంచేసింది…
  • ‘తెలుగు’ సభల్లో ఈనాడు సొంత డబ్బా
  • పవన్ కల్యాణ్ కి ఏబీఎన్ ఆర్కే ఘాటు లేఖ
  • తెలుగు మీడియాకి అది పోలవరమే…
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *