Main Menu

అప్పుడు వైసీపీ..ఇప్పుడు జ‌న‌సేన‌

Spread the love

ఏపీ లో ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో అస‌హ‌నం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. అనేక చ‌ట్టాలు కూడ‌ద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ లొసుగులు వాడుకుని ప్ర‌త్య‌ర్థుల‌ను క‌ట్ట‌డి చేసే య‌త్నం చేస్తోంది. అందులో భాగంగానే గ‌తంలో వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం ప్ర‌తినిదుల‌ను అరెస్టులు చేయించింది. పొలిటిక‌ల్ పంచ్ ర‌వికిర‌ణ్, ఇప్పాల ర‌వీంద్ర వంటి వారిని స్టేష‌న్ కి, జైలుకి త‌ర‌లించింది. అయినా ఆ త‌ర్వాత కూడా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పోస్టులు త‌గ్గింది లేదు. పైగా పొలిటిక‌ల్ పంచ్ అంటూ ఇంటూరి ర‌వికిర‌ణ్ మ‌రింత క్రియేటివిటీతో పోస్టులు చేస్తూ ఆద‌ర‌ణ పెంచుకుంటున్నారు.

ఇప్పుడు అదే ప‌ద్ధ‌తిలో జ‌న‌సైనికుల‌ను క‌ట్ట‌డి చేసే య‌త్నంలో టీడీపీ నేత‌లున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప‌ది మందికి పైగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల మీద కేసు న‌మోదు చేశారు. గుంటూరు ఆరండ‌ళ్ పేట పోలీస్ స్టేష‌న్ లో న‌మోద‌యిన కేసులో ఇప్ప‌టికే భీమ‌డోలుకి చెందిన శ్రీహ‌రిని, నెల్లూరుకి చెందిన శ్ర‌వ‌ణ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు.

ఇక అదుపురి లిస్టులో కుసంపూడి శ్రీనివాస్, డా. సాయి నందం, శ్ర‌వ‌ణ్ జ‌న‌సేన‌, పొలిటిక‌ల్ వార్, ప్రజాతీర్పు, ప‌ర‌శురాం నాయుడు, క‌ళ్యాణ్ దిలీప్ సుంకర‌, శివ ప్ర‌సాద్ సుంక‌ర‌, జ‌వ్వాది స‌తీష్ నాయుడు వంటి వారి పై కేసులు న‌మోదు చేశారు. టీడీపీ అధికారి ప్ర‌తినిధి యామిని సాధినేని ని వేధించార‌ని, అప్ర‌తిష్ట‌త క‌లిగించేలా పోస్టులు చేశారని, సోష‌ల్ మీడియా, ఎల‌క్ట్రానిక్ మీడియాలో ఆమె మీద అభ్యంత‌ర‌కర వ్యాఖ్య‌లు చేశార‌ని వ‌చ్చిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్టుల ప‌ర్వానికి శ్రీకారం చుట్టారు.

గ‌తంలో మ‌హిళా ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి వ‌నిత ఫిర్యాదుతో వైసీపీ నేత‌ల‌ను అరెస్ట్ చేయ‌గా, ఇప్పుడు మ‌రో మ‌హిళా నేత యామిని కంపెనీలో ప‌నిచేస్తున్న సిబ్బంది ఫిర్యాదుతో జ‌న‌సైనికుల‌ను అదుపులోకి తీసుకుంటుండ‌డం విశేషంగా మారుతోంది. సోష‌ల్ మీడియాను అదుపుచేసే ఇలాంటి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌వ‌ని అనుభ‌వం చాటుతున్నా టీడీపీ నేత‌లు అదే ప‌నిగా ముందుకు సాగ‌డం ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.






Related News

మీటూ ఎఫెక్ట్: ఇద్ద‌రు ఎడిట‌ర్ల‌పై వేటు

Spread the loveమాజీ పత్రికా సంపాదకులు ఎంజె అక్బర్‌, తరుణ్‌ తేజ్‌పాల్‌ను బుధవారం ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఇజిఐ)Read More

చ‌ర్చ‌నీయాంశంగా మారిన టీవీ9 స‌ర్వే

Spread the loveప్ర‌స్తుతం ఎన్నిక‌ల పోరులో ప్ర‌తీ అవ‌కాశం కూడా వినియోగించుకునేందుకు పార్టీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. మీడియా అందుకు తందానRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *