Main Menu

కంట‌త‌డిపెట్టిస్తున్న‌ జ‌ర్న‌లిస్ట్ వీడియో

Spread the love

తొలిసారిగా ఓ జ‌ర్న‌లిస్ట్ కి అధికార లాంఛ‌నాలు జ‌రిగాయి. పూర్తిగా ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. అయితే అందుకు కార‌ణం మావోయిస్టుల దుశ్చ‌ర్యే. మావోయిస్టుల కాల్పుల‌లో మ‌ర‌ణించిన వీడియో జ‌ర్న‌లిస్ట్ అంత్య‌క్రియ‌లు ముగిశాయి. చ‌త్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టుల దాడిలో దూరదర్శన్‌ అసిస్టెంట్‌ కెమెరామెన్‌ అచ్యుతానంద్ శర్మ చనిపోయిన నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. మావోయిస్టుల చ‌ర్య‌ను ప‌లువురు తీవ్రంగా ఖండించారు.

అయితే ఇప్పుడు అతనికి సంబంధించిన వీడియో నెట్లింట్లో చక్కర్లు కొడుతూ కంటితడి పెట్టిస్తోంది. ఆయన చనిపోతూ తన తల్లి కోసం ఓ సందేశాన్ని ఫోన్‌లో రికార్డు తీసుకున్నారు. ‘బహుశా నేను ఈ ఘటనలో చనిపోతాను. కానీ అమ్మ ‘ఐ లవ్‌ యూ’. చావు ముంచుకొస్తున్నా నేను భయపడం లేదు. నేను బ్రతకడం చాలా కష్టం. మాతో పాటు ఆరు, ఏడుగురు జవాన్లు మాకు రక్షణగా వచ్చినా అన్ని వైపులా నుండి మావోయిస్టులు మమ్మల్ని చుట్టుముట్టారు’ అన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతో ఈ వీడియో వైర‌ల్ కావ‌డ‌మే కాకుండా క‌న్నీరు ర‌ప్పిస్తోంది.






Related News

మీడియాకు జ‌న‌సేన ఝ‌ల‌క్

Spread the loveవైసీపీ అధికారిక ప‌త్రిక ముసుగులో స‌ర్థుబాట్లు పేరుతో రాసిన క‌థ‌నం క‌ల‌క‌లం రేపింది. జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్యRead More

బాబు ప‌రువు తీసిన మీడియా

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు కి అనుకున్న‌దొక‌టి..అయ్యిందొక‌టి అన్న‌ట్టుగా మారింది. ఎంతో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌తో నిర్వ‌హించిన ఢిల్లీ దీక్ష చివ‌ర‌కుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *