Main Menu

సాక్షికి రెట్టింపులో టీవీ9

Spread the love

తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర ముగింపు తెలుగు మీడియాలో సెంట‌ర పాయింట్ అవుతోంది. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ పాద‌యాత్ర‌కు మీడియా ప్రాధాన్య‌త‌నిస్తోంది. అందులో భాగంగా సుదీర్ఘ ఇంట‌ర్వ్యూల ప‌రంప‌ర సాగుతోంది. తొలుత సాక్షి టీవీ ఇంట‌ర్వ్యూ చేయ‌గా, తాజాగా టీవీ9 కూడా ఫుల్ లెంగ్త్ ఇంట‌ర్వ్చూ చేసింది. అయితే ఈ రెండు ఇంట‌ర్వ్యూల‌లో సాక్షి టీవీ క‌న్నా టీవీ9దే బాగా ఆక‌ట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

స్వ‌ప‌క్ష సాక్షి చాలా విష‌యాల‌ను స‌మ‌గ్రంగా అడ‌గ‌లేరు కాబ‌ట్టి, టీవీ9 మాత్రం ప్ర‌తిప‌క్షం స్థాయిలో ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. త‌ద్వారా అమ‌ర్ ఇంట‌ర్వ్యూ క‌న్నా ర‌జనీకాంత్ ఇంట‌ర్వ్యూ మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా సాగిన‌ట్టుగా క‌నిపించింది. యూ ట్యూబ్ వ్యూవ‌ర్స్ లో కూడా ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌య్యింది. సాక్షి టీవీ లైవ్ యూ ట్యూబ్ లో అత్య‌ధికంగా 12వేల మంది వీక్షించ‌గా, టీవీలో ఓ ద‌శ‌లో 22వేల‌కు చేరింది. త‌ద్వారా సాక్షి టీవీ క‌న్నా టీవీ9 డ‌బుల్ వ్యూయ‌ర్స్ సాధించింది.

ఇక రాజ‌ధాని మార్పు విష‌యం, కోడిక‌త్తి త‌గాదా , ప‌వ‌న్ వ్య‌వహారం వంటివి ప‌లు అంశాలు ప్ర‌స్తావించ‌డం ద్వారా సాక్షి టీవీలో క‌వ‌ర్ కాని ప‌లు అంశాలు టీవీ9 ముందుకు తీసుకొచ్చింది. ఇక అమ‌ర్ ని మీరు అంటూ స్పందించిన జ‌గ‌న్, టీవీ9 ప్ర‌తినిధి మాత్రం నువ్వే చెప్పు ర‌జ‌నీ అంటూ ప‌దే ప‌దే మాట్లాడ‌డం విశేష‌మే. టీవీలో కూడా యాజ‌మాన్యం మారిన త‌ర్వాతే సుదీర్ఘ విరామంతో జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూకి అవ‌కాశం ద‌క్కిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఎల్లో మీడియా అంటూ వ్యాఖ్యానించ‌డ‌మే త‌ప్ప జ‌గ‌న్ ఎవ‌రి పేరును ప్ర‌స్తావించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డ‌ట్టుగా చెప్ప‌వ‌చ్చు.






Related News

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

‘సాక్షి’కి అన్యాయం జ‌రిగిందా..?

Spread the loveమీడియా ఓ రాజకీయ సాధ‌నంగా మారిపోయిన త‌ర్వాత పాల‌క‌ప‌క్షాలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం విస్తృత‌మ‌య్యింది. గ‌తంలో కూడా కొంద‌రుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *