అడిగి తిట్టించుకుంటున్న టీవీ9

tv9-telugu-live-streaming
Spread the love

ఆశ్చ‌ర్యంగా ఉందా..అనుమానం ఎందుకు..కింద‌న ఉన్న ట్వీట్ చ‌ద‌వండి. మీకే అర్థ‌మ‌వుతుంది. అయినా అన్నింటికీ నాట‌కీయ‌త అద్ద‌డ‌మే న్యూస్ అనుకునే వాళ్లు పెరుగుతున్న ద‌శ‌లో టీవీ9 దిగ‌జార‌డానికి ఇంత‌కుమించిన మార్గాలుండవేమో…పాపం అత‌డెవ‌రో జాఫ‌రు అనే పాత్రికేయుడి షో నుంచి తాజాగా ద‌గ్గుబాటి రానా ఇంట‌ర్వ్యూ వ‌ర‌కూ గెస్ట్ తిట్ట‌డం, ఇంట‌ర్వ్యూ చేస్తున్న‌వాళ్లు ఏదో కంగారుప‌డ‌డం , దానినే ప్రోమోగా వాడి బార్క్ రేటింగ్ పాయింట్లు సాదించ‌డం, ఇదే టీవీ9 ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. రేటింగ్ కోసం ఏ గ‌డ్డి క‌ర‌వ‌డానికైనా మీడియా సిద్ధ‌ప‌డుతోంద‌ని ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో బ‌ల‌మైన అభిప్రాయం. దానిని మ‌రింత రూఢీ ప‌రిచేలా టీవీ9 లాంటి వాళ్ల తీరు ఉంది.

tv9

తాజాగా ట్వీట్ లో రానా చెబుతున్న విష‌యం కింద లింకులో కూడా చూడండి. ఎంత ప‌చ్చిగా ఆ లేడీ యాంక‌ర్ తిట్టించుకుని మ‌రీ, ప్ర‌చారానికి వాడుకుంటుందో..ఇలాంటి వ్య‌వ‌హారాల‌కు టీవీ9 పెట్టింది పేరుగానే చెప్ప‌వ‌చ్చు. అస‌లు తెలుగులో న్యూస్ చ‌ద‌వ‌డ‌మే త‌ప్ప చూడ‌డం తెలియ‌ని వాళ్ల‌కు న‌టుల‌తో వార్త‌లు అందించిన చ‌రిత్ర టీవీ9 ది. కొన్ని ఆందోళ‌న‌ల‌ను ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను టీవీల కోసం రీషూట్ చేయించిన చ‌రిత్ర వారిది. ఇక ఇప్పుడు ఆ ద‌శ దాటిపోవ‌డంతో తొండ ముదిరి ఊస‌ర‌వెల్లి అవుతుంది…ఎదుటి వాళ్ల‌ను తిట్టించుకునే ద‌శ దాటి..త‌న‌ను తిట్టేవాళ్ల‌ను కూడా మార్కెట్ చేసుకునే ద‌శ‌కు వ‌చ్చింది.

అయినా పాత్రికేయం అంటే విలువ‌ల గురించి మాట్లాడేవాళ్ల‌కు, మెరుగైన స‌మాజం అంటూ నీతులు చెప్పేవాళ్ల‌కు ఆచ‌రించే తీరిక ఎక్క‌డ ఉంటుంది. అందుకే టీవీ9 ఇంత‌గా బ‌రితెగించిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇలాంటి మీడియా సంస్థ‌ల‌తో తెలుగువారి దుస్థితి ఇంకే స్థితికి చేరుతుందో ఏంటో..!!


Related News

papers telugu news

మీడియా ఏం చేసినా చెల్లుతుందా..?

Spread the loveఇదే ప్ర‌శ్న చాలామంది నుంచి వినిపిస్తోంది. రాజ‌కీయ పార్టీలు, మ‌త బోధ‌కులు, కుల సంఘాలు కూడా మీడియాలోకిRead More

tv9-telugu-live-streaming

అడిగి తిట్టించుకుంటున్న టీవీ9

Spread the loveఆశ్చ‌ర్యంగా ఉందా..అనుమానం ఎందుకు..కింద‌న ఉన్న ట్వీట్ చ‌ద‌వండి. మీకే అర్థ‌మ‌వుతుంది. అయినా అన్నింటికీ నాట‌కీయ‌త అద్ద‌డ‌మే న్యూస్Read More

 • మీడియా సంస్థ‌ల‌కు బాబు ఆఫ‌ర్
 • తెలుగు న్యూస్ చానెళ్ల తాజా రేటింగ్స్
 • జ‌ర్న‌లిస్టును చంపేస్తాం..!
 • పేరు మారింది..కానీ తీరు..?
 • ఎన్టీవీ చైర్మ‌న్ ఇంట అఖిల‌ప‌క్షం..!
 • నెల‌రోజులుగా యుద్ధం “ముచ్చట్లు”…
 • బుల్లితెర‌పై ఎన్టీఆర్ హ‌వా
 • ఏపీ జ‌ర్న‌లిస్టుల‌కు ట్రిపుల్ ఆశ‌లు..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *