Main Menu

టీవీ9 యూ ట‌ర్న్ తీసుకుందా?

Spread the love

ఇదో చ‌ర్చ మొద‌ల‌య్యింది. తాజాగా ఆ చానెల్ తీరు గ‌మ‌నిస్తే ఇలాంటి అనుమాన‌మే క‌లుగుతోంది. ఆరంభం నుంచి అధికార‌పార్టీకి వంత‌పాడ‌డంలో ఈ చానెల్ ది అందెవేసిన చేయిగా చెబుతుంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగా కొత్త కొత్త ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంభించడంలో ఆరితేరిన‌ట్టుగా చెబుతారు. అయితే ఇటీవ‌ల యాజ‌మాన్యం మారిన త‌ర్వాత ధోర‌ణి దాదాపుగా మారిపోయింద‌నే రీతిలో ప్ర‌స్తుతం టీవీ9 ప్ర‌సారాలు క‌నిపిస్తున్నాయి. ఇది ఎన్నాళ్లుంటుంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే తాజాగా జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి త‌ర్వాత ప‌రిణామాలు గ‌మ‌నిస్తే టీవీ9 దాదాపుగా యూ ట‌ర్న్ తీసుకున్న‌ట్టు అనేక మంది భావిస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ వాద‌న క‌న్నా విప‌క్షానికే ప్రాధాన్య‌త‌నిచ్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నం దానికి తార్కాణంగా చెబుతున్నారు.

ఇటీవ‌ల టీవీ9 గ్రూపుని మై హోమ్స్ రామేశ్వ‌ర రావు, మేఘా కృష్ణారెడ్డి కాంబినేష‌న్ టేకోవ‌ర్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇరువురికి తెలంగాణా ఎన్నికల్లో కేసీఆర్ కి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం అత్య‌వ‌స‌రం. అందుకు త‌గ్గ‌ట్టుగానే జ‌గ‌న్ పై దాడి జ‌ర‌గ‌గానే కేసీఆర్ క్యాంప్ స్పందించిన‌ట్టుగానే టీవీ9 స్వ‌రం వినిపించింది. జ‌గ‌న్ కి కాస్త సానుకూలంగా ప్ర‌సారాలు సాగిస్తోంది. చివ‌ర‌కు వైవీ సుబ్బారెడ్డి వంటి వారి ప్రెస్ మీట్ లు కూడా బ్రేక్స్ లేకుండా ఆద్యంతం చూపించి ఆశ్చర్య‌ప‌రుస్తోంది. ఇదంతా రాజ‌కీయ ల‌క్ష్యాల సాధ‌న‌కు త‌గ్గ‌ట్టుగానే క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ మార్పు మాత్రం అనూహ్యంగానే చెప్పాలి.అంతేగాకుండా ఒక్క సాక్షి మిన‌హా మిగిలిన వారంతా జ‌గ‌న్ పై జ‌రిగిన దానిని దాడిగా చెబుతుంటే, టీవీ9 మాత్రం ఓ అడుగు ముందుకేసి హ‌త్యాయ‌త్నం గా చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. త‌ద్వారా వైసీపీ నేత‌ల వాద‌న‌కు బ‌లం చేకూర్చింద‌న్న‌ది స్ప‌ష్టంగా చెప్ప‌వ‌చ్చు. సీఎం చంద్ర‌బాబు చిన్న దాడి అని, లోకేష్ అయితే జ‌గ‌న్నాట‌కం అని చెబుతున్న వేళ టీవీ9 ఇలాంటి లైన్ తీసుకోవ‌డం గ‌మ‌నించాల్సిన అంశంగా క‌నిపిస్తోంది.

అంతేగాకుండా టీడీపీ కి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే చ‌ర్చ‌ల్లో కూడా ర‌జ‌నీకాంత్ వంటి వారి దూకుడు దాదాపుగా త‌గ్గిపోయిన‌ట్టుగా అంచ‌నాలేస్తున్నారు. న్యూట్ర‌ల్ గా ఉన్న‌ట్టు క‌నిపించే ప్ర‌య‌త్నం మ‌రింత తీవ్ర‌మ‌యిన‌ట్టుగా భావిస్తున్నారు. ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు, పార్టీల వాద‌న‌కు తోడుగా ప్ర‌త్య‌క్ష సాక్షుల పేరుతో చేసిన ప్ర‌సారాల్లో కూడా కొంత జ‌గ‌న్ అనుకూల వాద‌న‌ల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డం విశేషంగానే భావించాల్సి ఉంటుంద‌ని మీడియా వ‌ర్గాల అభిప్రాయం.దాంతో టీవీ9లో వ‌చ్చిన ఈ మార్పు వైసీపీ క్యాంప్ కి తాత్కాలిక ఉప‌శ‌మంగానే భావించ‌వ‌చ్చు. సొంత సాక్షికి తోడుగా ఎన్టీవీ కూడా కొంత బ్యాలెన్స్ గా వెళుతున్న త‌రుణంలో టీవీ9 తోడ్పాటు మ‌రింత ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌ని లెక్క‌లేస్తున్నారు.


Related News

మీడియాకు జ‌న‌సేన ఝ‌ల‌క్

Spread the loveవైసీపీ అధికారిక ప‌త్రిక ముసుగులో స‌ర్థుబాట్లు పేరుతో రాసిన క‌థ‌నం క‌ల‌క‌లం రేపింది. జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్యRead More

బాబు ప‌రువు తీసిన మీడియా

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు కి అనుకున్న‌దొక‌టి..అయ్యిందొక‌టి అన్న‌ట్టుగా మారింది. ఎంతో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌తో నిర్వ‌హించిన ఢిల్లీ దీక్ష చివ‌ర‌కుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *