ఇంగ్లీష్ చానెల్ తో టీవీ5 టైఅప్

tv5-news-live
Spread the love

తెలుగులో ప్రముఖ చానెళ్లలో ఒకటి టీవీ5. పదేళ్ల క్రితమే తెలుగులో మూడో న్యూస్ చానెల్ గా ప్రారంభమయ్యింది తాజా బార్క్ రేటింగ్స్ లో కూడా టాప్ 3లో కొనసాగుతోంది. ఇటీవలే కొత్తగా వార్తా మార్కెట్ లో విస్తరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా హిందూధర్మం పేరుతో ఒక ధార్మిక చానెల్ ను ప్రారంభించింది. యూ ట్యూబ్ లో ఓ బిజినెస్ చానెల్ కి శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే కన్నడంలో న్యూస్ చానెల్ ని ప్రారంభించింది. మొత్తంగా గడిచిన కొద్ది నెలలుగా మార్కెట్ లో పరిధి పెంచుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది.

దానికితోడు తాజాగా ఢిల్లీ కేంద్రంగా వస్తున్న ఇంగ్లీష్ న్యూస్ చానెల్ రిపబ్లిక్ టీవీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని అర్ణబ్ గోస్వామి కూడా అధికారికంగా ప్రకటించారు. ప్రాంతీయంగా రిపబ్లిక్ టీవీకి అవసరమైన న్యూస్ ఫీడ్ ని టీవీ5 అందిస్తుంది. అదే సమయంలో జాతీయ స్థాయి పరిణామాలలో ఫీడ్, ఇతర అవసరాలను రిపబ్లిక్ టీవీ తీరుస్తుంది. దాంతో ఉభయతారకంగా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే ఎన్డీటీవీతో సాక్షి టీవీ కి ఒప్పందం కొనసాగుతోంది. టైమ్స్ నౌ, టీవీ9 మధ్య అవగాహన ఉంది. తాజాగా రిపబ్లిక్ టీవీ, టీవీ5 మధ్య ఒప్పందం తెలుగు మీడియాని జాతీయ చానెళ్లుగా చెప్పుకునే ఢిల్లీ కేంద్రంగా వస్తున్న చానెళ్లకు దగ్గర చేసినట్టవుతుంది.


Related News

amaravati design

అమరావతి ఆశలు నీరుగార్చేసిన చానెల్

Spread the loveఏపీ రాజధానిలో రకరకాల నగరాల నిర్మాణం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించారు కూడా. పరిపాలన అంతాRead More

tv channels ratings

‘కత్తి’ చుట్టూ మీడియా: కథ నడిపిందెవరు?

Spread the loveఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. కత్తి మహేష్ కి, పవన్ కళ్యాణ్ అభిమానులకు మొదలయిన వార్ మరింత ముదరడంలోRead More

 • గజల్స్ గలీజు వెనుక మీడియా చానెల్స్ యజమాని
 • తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్
 • ఇంగ్లీష్ చానెల్ తో టీవీ5 టైఅప్
 • వైసీపీ పరువు తీస్తున్న సోషల్ మీడియా
 • సోషల్ మీడియా సాయంతో ముంచేసింది…
 • ‘తెలుగు’ సభల్లో ఈనాడు సొంత డబ్బా
 • పవన్ కల్యాణ్ కి ఏబీఎన్ ఆర్కే ఘాటు లేఖ
 • తెలుగు మీడియాకి అది పోలవరమే…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *