Main Menu

ఆందోళ‌న వ‌ద్దు..టీవీలు ఆగిపోవు!

Spread the love

ఈ నెల 29 తర్వాత టీవీ ప్రసారాలు ఆగిపోతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) తెలిపింది. కొత్త నియంత్రణ విధానాల అమలు నేపథ్యంలో ఇప్పటికే చందా చెల్లించిన చానళ్ల ప్రసారం కూడా నిలిచిపోతుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం వినియోగదారులు వీక్షిస్తున్న ఏ చానల్ ప్రసారం కూడా 29వ తేదీ తర్వాత ఆగిపోదని పేర్కొంది. ఈ మేరకు ప్రసార సంస్థలు, పంపిణీ ఆపరేటర్లు, స్థానిక కేబుల్ ఆపరేటర్ల తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.

మార్చి 2017లో ప్రసార, కేబుల్ సేవలకు సంబంధించి ట్రాయ్ సరికొత్త నియంత్రణ విధివిధానాలను జారీ చేసింది. జూలై 3, 2018లో వీటిని తిరిగి జారీ చేస్తూ అమలు షెడ్యూలును నిర్దేశించింది. అయితే, వివిధ టీవీల్లో వస్తున్న ప్రకటనల్లో స్పష్టత లేకపోవడంతో ఈ నెల 29 నుంచి చందా చెల్లించిన చానళ్ల ప్రసారాలు నిలిచిపోతాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో స్పందించిన ట్రాయ్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. కొత్త విధివిధానాల అమలు కారణంగా టీవీ సేవల్లో ఎటువంటి అంతరాయం ఉండదని పునరుద్ఘాటించింది.






Related News

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

‘సాక్షి’కి అన్యాయం జ‌రిగిందా..?

Spread the loveమీడియా ఓ రాజకీయ సాధ‌నంగా మారిపోయిన త‌ర్వాత పాల‌క‌ప‌క్షాలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం విస్తృత‌మ‌య్యింది. గ‌తంలో కూడా కొంద‌రుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *