Main Menu

జ‌ర్న‌లిస్ట్ కి గ‌వ‌ర్న‌ర్ క్ష‌మాప‌ణ‌

Spread the love

మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ ప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ తీరు వివాదంగా మారింది. చివ‌ర‌కు ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌చ్చింది. చెన్నైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఫ్రంట్ లైన్ ప‌త్రిక ప్ర‌తినిధి ల‌క్ష్మీ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ ప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ తీరు ప‌లువురిని ఆగ్ర‌హానికి గురిచేసింది. బ‌హిరంగంగా మ‌హిళా జ‌ర్న‌లిస్టు బుగ్గ మీద చేతులు వేసిన తీరు వివాదానికి దారితీసింది. బాధితురాలు తీవ్రంగా స్పందించారు. తాను మ‌నోవేధ‌న‌కు గుర‌యిన‌ట్టు తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ తీరు సిగ్గు చేట‌ని పేర్కొన్నారు.

దాంతో చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ దిగివ‌చ్చారు. భ‌న్వ‌ర్ లాల్ పురోహిత్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. త‌న మీద తీవ్ర‌ప‌ద‌జాలంతో సోష‌ల్ మీడియా లో వ‌స్తున్న క‌థ‌నాల‌పై క‌ల‌త చెందుతున్న‌ట్టు పేర్కొన్నారు. త‌న‌కు ఉద్దేశాలు ఆపాదించ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తిచేశారు. మ‌న‌వారిగా భావించిన జ‌ర్న‌లిస్టు బుగ్గల మీద చేతులు వేయ‌డాన్ని మ‌రోర‌కంగా భావించ‌కూడ‌ద‌న్నారు.

అయితే బీజేపీ నేత‌లు మాత్రం గ‌వ‌ర్న‌ర్ మీద వ్య‌తిరేక‌త‌తోనే ఇలాంటి ప్ర‌చారం సాగిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.






Related News

మిడిమిడి మీడియా అంటే అదే..!

Spread the loveఇప్ప‌టికే అంద‌రికీ అర్థ‌మ‌య్యింది. మీడియా అంటే నిష్ఫ‌క్ష‌వార్త‌లు అందిస్తుంద‌ని న‌మ్మిన త‌రం నుంచి మీడియా అంటే ఆర్థికRead More

టీవీ9 అమ్మ‌కంపై త‌గాదా

Spread the loveతెలుగులో టీఆర్పీ ప‌రంగా టాప్ లో నిలిచే టీవీ9 చానెల్ అమ్మ‌కం పెద్ద త‌గాదాగా మారుతోంది. ఆర్థికRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *