Main Menu

తెలుగు పత్రికలు తీరు అంతేనయా

papers telugu news
Spread the love

మీడియా కార్పోరేట్ బంధం వేగంగా బలపడుతోంది. తెలుగు నాట కూడా అది కనిపిస్తోంది. దానికి నిదర్శనంగా అనేక ఘటలను చెప్పవచ్చు. కానీ తాజాగా ప్రజాధనం లూటీ చేసిన అంశంలో కూడా మీడియా మౌనంగా ఉంటూ, దొరికిపోయిన దొంగకు వత్తాసుపలకడం గమనిస్తే జాతీయ మీడియాతో పాటు మన తెలుగు మీడియా తీరు తేటతెల్లం అవుతుంది. అమిత్ షా తనయుడు బండారం బయటపడడంతో బీజేపీ పెద్దలు బేజారెత్తిపోతున్నారు. ఆధారాలతో దొరికేసి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాతో సమానంగా అమిత్ షా కొడుకు జే అమిత్ షా దోచుకుంటున్న తీరు స్పష్టం కావడంతో బెదిరింపులకు దిగుతోంది.

అయితే టెంపుల్ ఎంటర్ ప్రైజస్…ఆ పేరు కూడా చూడండి..గుడి కడతామంటూ జనాలను నమ్మించి మోసగించినట్టే ..గుడి పేరుతో కంపెనీ పెట్టి కొల్లగొట్టిన తీరు ఇట్టే అర్థమవుతోంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కి అందించిన అధికార బ్యాలెన్స్ షీటులోనే 16వేల శాతం ఆదాయం పెరగడం అవినీతిని తేటతెల్లం చేస్తోంది. ఈ కథనాన్ని రోహిణీ సింగ్ అనే జర్నలిస్ట్ రాయడం. గతంలో రాబర్ట్ వాద్రా వ్యవహారాలన్నీ వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు చేతి నుంచి వచ్చిన మరో పరిశోధనాత్మక పెను సంచలనం కావడం గమనార్హం. అయితే అప్పట్లో రాబర్ట్ వాద్రా గురించి రాసినప్పుడు అనూహ్యంగా పెద్ద పెద్ద అక్షరాలతో కథనాలు రాసిన మీడియా ఇప్పుడు అమిత్ షా కొడుకు వ్యవహారం అదే స్థాయిలో సాగుుతన్న సైలెంట్ అయిపోయింది.

తెలుగు మీడియాలో అమిత్ షా కొడుకు పరువు నష్టం దావా వేస్తున్నారంటూ ఈనాడులో సింగిల్ కాలమ్ వార్త వచ్చింది. తద్వారా అవినీతి సాగిన విషయం జనాలకు అర్థం కాకుండా జాగ్రత్తపడింది. అంతకుమించి ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి పత్రికలు వార్తలు రాసిన పాపాన పోలేదు. ఇక వామపక్ష పత్రికల్లో ప్రజాశక్తి మెయిన్ పేజ్ లో కాంగ్రెస్ ఆరోపణలన్నట్టుగా హెడ్డింగ్ పెట్టినా కొంత కథనం ఇచ్చి సరిపెట్టేసింది. కానీ నవతెలంగాణా మాత్రం సంపూర్ణ కథనాలు ఇచ్చింది. అదే సమయంలో విశాలాంధ్ర తీరు మరీ విడ్డూరంగా ఉంది. పూర్తిగా వాస్తవాలను వక్రీకరించేలా రాతలున్నాయి. ఈ రెండు పత్రికలే ఇలా ఉంటే మిగిలిన పత్రికల్లో అసలు వార్తలు వస్తాయిన ఆశించడం అత్యాశే అవుతుంది.

ఇలాంటి కథనాలకు కారణం కూడా లేకపోలేదు. నేషనల్ న్యూస్ కి సంబంధించి తెలుగుపత్రికలు ఎక్కువగా న్యూస్ ఏజన్సీల మీద ఆధారపడతాయి. అవి అందించే రాతలనే తర్జుమా చేసుకుని తెలుగు పాఠకులకు అందిస్తాయి. అందువల్ల ఏజన్సీలన్నీ కేంద్ర పెద్దల ఆగ్రహానికి గురికాకుండా తీసుకున్న జాగ్రత్తలు చివరకు తెలుగు మీడియా రాతల్లో ప్రస్ఫుటిస్తోంది. అయినా కీలకాంశం మీద సమాచారం సేకరించి వార్తలు ఇవ్వాల్సిన మీడియా మిన్నకుండిపోవడం ప్రమాదకర సంకేతం. అదే సమయంలో ది హాన్స్ ఇండియా మాత్రం అందరికన్నా భిన్నంగా తన ప్రత్యేకతను చాటుకునేలా వివరణాత్మక కథనాలు ఇచ్చి వాస్తవికతకు దర్పణం పట్టింది.


Related News

moturi-hanumantha-rao

ఉత్త‌మ జ‌ర్న‌లిస్టు అవార్డ్ కి ఆంధ్ర‌జ్యోతి ప్ర‌తినిధి

Spread the love మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు- 2018 అవార్డుకు ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం బ్యూరో రిపోర్టర్‌ సిహెచ్‌Read More

at news republic

తెలుగులో మ‌రో శాటిలైట్ చానెల్ సిద్దం

Spread the loveతెలుగు మీడియాలో ఇప్ప‌టికే న్యూస్ చానెళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఇటీవ‌ల వెబ్ చానెళ్లు విజృంభిస్తుండ‌డంతో కెమెరాల సంద‌డిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *