తెలుగు మీడియాకి అది పోలవరమే…

24852474_2012087305741865_4351450115099721221_n
Spread the love

ఏపీలో పోలవరం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.పాలక, ప్రతిపక్షాల మధ్యే కాదు మిత్రపక్షాల మధ్య కూడా పోలవరం కేంద్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి. అందుకు కొనసాగింపుగానే తాజాగా హస్తినలో జరిగిన పోలవరం పై అత్యున్నత సమావేశం కనిపించింది. జనవనరుల మంత్రి నితిన్ గడ్కరీ నిలదీయడంతో టీడీపీ మంత్రులకు నోట మాట రాలేదు. అయితే వాస్తవానికి పోలవరం విషయంలో చంద్రబాబు తమకు సమాచారం ఇవ్వకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం బీజేపీ పెద్దలకు రుచించడం లేదు. కీలకమైన కాంట్రాక్టర్ మార్పిడి విషయంలో కూడా తాము కాదని చెప్పినప్పటికీ 60సీ పేరుతో టెండర్లు పిలవడంతో కమలనాధులకు తీవ్ర ఆగ్రహం కలిగించినట్టు కనిపిస్తోంది. దాంతో ఏకంగా పోలవరం కాఫర్ డ్యామ్ నిలిపివేయాలంటూ కమిటీ రిపోర్ట్ రావడం, ఆ వెంటనే ఘాటు లేఖ రావడం చంద్రబాబుకి మింగుడుపడని స్థితి తీసుకొచ్చింది.

ఈ నేపథ్యంలో జరిగిన సమావేశం కావడంతో సహజంగానే ఆసక్తి పెరిగింది. అయితే అంతర్గతంగా సమావేశంలో ఏం జరిగిందన్నది పక్కన పెడితే ఢిల్లీ కేంద్రంగా వచ్చే పత్రికల కథనాలకు, తెలుగులో ప్రధానంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు రాతలకు పొంతన కనిపించడం లేదు. పోలవరమే అంటూ ఆంధ్రజ్యోతికి మాత్రమే కనిపించగా, ఈనాడు మాత్రం కేంద్రం భరోసా అంటూ సరిపెట్టింది అయితే మిగిలిన పత్రికలు మాత్రం చంద్రబాబు సర్కారుకి కేంద్రం నుంచి గట్టి హెచ్చరికలే వచ్చినట్టు కనిపిస్తోంది. పైగా నిర్వాసితులకు అవసరమైన నిధులు తమకు సంబంధం లేదని, కేవలం జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన నాటి నిధులు అందిస్తామని చెప్పినట్టు కథనాలు రాశాయి. దాంతో ఆ రెండు పత్రికలకు భిన్నంగా కనిపించిన అంశం, మిగిలిన వారందరికీ మరోలా కనిపించడం గమనార్హం.

24068141_2012087312408531_4921392737025964699_n

అంటే చంద్రబాబుకి పెద్ద చిక్కుగా మారిన విషయంలో ఏదో రకంగా ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా కాపాడడమే లక్ష్యంగా ఈనాడు, జ్యోతి కథనాలున్నట్టు కనిపిస్తోంది. కానీ కొన్ని పత్రికలు మాత్రం అసలు విషయాన్ని, ఆఖరికీ గడ్కరీ స్వయంగా పరిశీలనకు వస్తున్న విషయాన్ని చాటిచెప్పడం గమనిస్తే మీడియాలో కథనాల వెనుక అసలు రాజకీయ లక్ష్యాలు ఎవరికోసమేనన్నది స్పస్టం అవుతోంది.


Related News

amaravati design

అమరావతి ఆశలు నీరుగార్చేసిన చానెల్

Spread the loveఏపీ రాజధానిలో రకరకాల నగరాల నిర్మాణం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించారు కూడా. పరిపాలన అంతాRead More

tv channels ratings

‘కత్తి’ చుట్టూ మీడియా: కథ నడిపిందెవరు?

Spread the loveఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. కత్తి మహేష్ కి, పవన్ కళ్యాణ్ అభిమానులకు మొదలయిన వార్ మరింత ముదరడంలోRead More

 • గజల్స్ గలీజు వెనుక మీడియా చానెల్స్ యజమాని
 • తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్
 • ఇంగ్లీష్ చానెల్ తో టీవీ5 టైఅప్
 • వైసీపీ పరువు తీస్తున్న సోషల్ మీడియా
 • సోషల్ మీడియా సాయంతో ముంచేసింది…
 • ‘తెలుగు’ సభల్లో ఈనాడు సొంత డబ్బా
 • పవన్ కల్యాణ్ కి ఏబీఎన్ ఆర్కే ఘాటు లేఖ
 • తెలుగు మీడియాకి అది పోలవరమే…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *