మీడియా ఏం చేసినా చెల్లుతుందా..?

papers telugu news
Spread the love

ఇదే ప్ర‌శ్న చాలామంది నుంచి వినిపిస్తోంది. రాజ‌కీయ పార్టీలు, మ‌త బోధ‌కులు, కుల సంఘాలు కూడా మీడియాలోకి ప్రవేశించిన త‌ర్వాత జ‌ర్న‌లిజం రూప‌మే మారిపోయింది. విలువ‌ల‌కు దాదాపుగా వ‌లువ‌లు ఊడ‌దీసినట్టే అయ్యింది. అందుకే పాత్రికేయానికి కొత్త అర్థాలు వెదుక్కునే ప‌రిస్థితి వ‌చ్చింది. పార్టీల వారీగా చీలిన మీడియాలో ఏ గూటిలో ఉంటే ఆ గూటి రాగ‌మే ఆల‌పించ‌డానికి త‌గ్గ‌ట్టుగా జ‌ర్న‌లిస్టులు రూపొందుతున్నారు. మ‌నుగ‌డ‌కు అంత‌కుమించిన మార్గం లేద‌ని భావిస్తున్నారు. మారుతున్న ప‌రిస్థితుల్లో ఇలాంటి ప‌రిణామాలు అనివార్య‌మ‌ని కూడా కొంద‌రు సూత్రీక‌రిస్తున్నారు. అలాంటి వారిలో కొంద‌రు ఏదైనా ఓ సంస్థ‌లో ప‌నిచేస్తున్న‌ప్పుడు కేవ‌లం ఆ మేనేజ్ మెంట్ ల‌క్ష్యాల‌క‌నుగుణంగా క‌థ‌నాలు ఇవ్వ‌డం, వారి విరోధుల మీద బుర‌ద‌జ‌ల్ల‌డానికి ఎంత‌కైనా తెగించ‌డానికి త‌యార‌వుతున్నారు. వాస్త‌వాల‌ను విస్మ‌రించి, ఇంకా చెప్పాలంటే పాత‌రేసి త‌మ ప‌బ్బం గ‌డుపుకునే ప‌నిలో ఉన్నారు. అందుకే ఇప్పుడు సామాన్యుడు సైతం మీడియాను నిల‌దీయ‌డానికి ముందుకొస్తున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు వైఎస్ జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసునే తీసుకుందాం. ఈ కేసు గురించి మీడియాలో వ‌చ్చిన‌న్ని క‌థ‌నాలు మ‌రే కేసులోనూ వ‌చ్చి ఉండ‌వు. కాంగ్రెస్ త‌రుపున మంత్రి, టీడీపీ త‌రుపున మాజీ ఎంపీ పిటీష‌న్ వేసిన నాటి నుంచి తీర్పు వ‌చ్చే వ‌ర‌కూ ఒక‌ర‌క‌మైన క‌థ‌నాలు. ఆత‌ర్వాత జ‌గ‌న్ అండ్ కో విచార‌ణ దానికి అనుగుణంగా రాసిన రాతలు. అరెస్టుల త‌ర్వాత జ‌గ‌న్ చొక్కా నెంబ‌ర్ నుంచి లోప‌ల ఏం చేస్తున్నార‌నే విష‌యాల వ‌ర‌కూ, ఎవ‌రెవ‌రూ క‌లుస్తున్నార‌న్న అంశాల వ‌ర‌కూ, ఆత‌ర్వాత విడుద‌ల నాడు జ‌రిగిన ర్యాలీ నుంచి ప్ర‌తీ వారం వాయిదాల‌కు వెళుతున్న ప‌రిస్థితి వ‌ర‌కూ అన్నీ మీడియాలో వార్త‌లే. ఆరేడేళ్లుగా నిత్యం జ‌గ‌న్ కేసులు అనే మాట విన‌ని, చ‌ద‌వ‌ని ప‌రిస్థితి లేదు. అలాంటి కేసుల్లో ఇప్ప‌టికే 9 చార్జీషీట్లు కొట్టివేశారు. తాజాగా లేపాక్షి హ‌బ్ కేసులో ఐఏఎస్ అధికారి శాంబాబు మీద అభియోగాల‌ కేసులో సీబీఐ వాద‌న‌ను కోర్ట్ తోసిపుచ్చింది. దాంతో క్లీన్ చిట్ ల‌భించింది.

అయితే ఈ వార్తకు మాత్రం మీడియాలో ప్రాధాన్య‌త లేదు. జ‌గ‌న్ ల‌క్ష కోట్లు తినేశార‌ని చేసిన విమ‌ర్శ‌ల‌కు చోటు క‌ల్పిస్తూ కోర్టులు ఆ కేసులు కొట్టేస్తున్న విష‌యం మాత్రం మీడియా తొక్కిపెడుతోంది. జ‌గ‌న్ త‌ప్పులేద‌ని చెబుతూ , కేసుల వ్య‌వ‌హారాల‌ను త‌న‌కు అనుగుణ‌మైన కోణంలో చూపించిన మీడియా కూడా ఉండ‌వ‌చ్చు కానీ మెజార్టీ వ్య‌వ‌హారం మొద‌టి ర‌క‌మే. ఈ వ్య‌వ‌హారం ఓ ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల మీద క‌దులుతున్న‌ప్పుడు కనీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం గానీ, వారి నిజ‌మైన స‌మ‌స్య‌ల‌ను పూర్తిగా బేఖాత‌రు చేయ‌డం గానీ ఇలాంటి అనేకం మ‌న ముందు సాక్ష్యంగా చెప్ప‌వ‌చ్చు.

అందుకే ఇప్పుడు జనాల‌ను ఇలా నాణానికి ఒక‌వైపు విష‌యాల‌ను మాత్ర‌మే పాఠ‌కులు, ప్రేక్ష‌కుల‌కు అందించే ప‌రిస్థితిని ప్ర‌శ్నిస్తున్నారు. మీడియా ఏం చేసినా చెల్లుతుందా అన్న వాద‌న తెస్తున్నారు. కానీ వాస్త‌వానికి మీడియా ఎంత‌గా త‌న ప్ర‌యోజనాల కోసం ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జా ప్ర‌యోజ‌నార్థ‌మే ప‌నిచేయాలి. దానికి తగ్గ‌ట్టుగా మీడియా సంస్థ‌లు భారీ ప్ర‌యోజ‌నాలు పొందుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప‌త్రిక‌లు న్యూస్ ప్రింట్ ను రాయితీపై సంపాదిస్తున్నారు. చానెళ్ళ‌కు కూడా స‌ర్కారు ప‌లు రాయితీలందిస్తోంది. ప్ర‌సార సాధ‌నాల‌కు అవ‌స‌ర‌మైన సామాగ్రి దిగుమ‌తి చేసుకోవ‌డానికి ప‌లు రూపాల్లో ప్ర‌యోజ‌నాలు ద‌క్కించుకుంటున్నాయి. అంతేగాకుండా మీడియా సంస్థ‌ల ఏర్పాటు కోసం భారీగా ప్ర‌భుత్వ స్థ‌లాలు తీసుకుంటున్నారు. తాజాగా వైజాగ్ లో , అంత‌కుముందు రేణిగుంట‌లో ఆంధ్ర‌జ్యోతికి స్థ‌లాలు కేటాయిస్తూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

త్వ‌ర‌లో అమరావ‌తిలో కూడా మీడియా సంస్థ‌ల పేరుతో ఖ‌రీదైన స్థ‌లాలు కేటాయించ‌డానికి చంద్ర‌బాబు సుముఖ‌త చూపారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం నుంచి అంటే ప్ర‌జ‌ల సొమ్ముని వివిధ రూపాల్లో ప్ర‌యోజ‌నంగా ద‌క్కించుకుంటున్న సంస్థ‌ల‌న్నీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నార్థ‌మే ప‌నిచేయాలి. దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు మీడియా కూడా నిల‌దీయ‌డానికి అతీతం కాద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌జ‌ల‌కు స‌మాచారం అందించ‌డంలో సొంత ప్ర‌యోజ‌నాలు కొంత చూసుకున్న‌ప్ప‌టికీ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌డం వీలు కాదు. అలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్పుడు మీడియాను నిలువ‌రించే వ్య‌వ‌స్థ ఉండాల‌ని కూడా కొంద‌రు అంటున్నారు. కానీ చాలాకాలంగా మీడియాకి స్వీయ‌నియంత్ర‌ణ అవ‌స‌ర‌మ‌నే వాద‌న కూడా ఉంది. త‌న‌కు న‌చ్చ‌ని స‌మాచారాన్ని పూర్తిగా మ‌రుగున‌ప‌ర‌చ‌డం, లేదా అర‌కొర స‌మాచారంతో ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేయ‌డం మీడియా ని చుల‌క‌న చేస్తాయి. విశ్వ‌స‌నీయ‌త అన్న మాట‌కు అర్థం లేకుండా మారుస్తాయి. ఇప్పుడు జ‌రుగుతున్న‌ద‌దే. కాబ‌ట్టి చ‌ట్ట ప్రకారం మీడియాని నిల‌దీయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే మార్పు వ‌స్తుంది. అదే స‌మ‌యంలో ప్ర‌జాకోర్టులో వారి వ్య‌వ‌హారం సామాన్యుడికి అర్థ‌మ‌యితే మ‌రింత చెంప‌పెట్టుగా మారుతుంది. అందుకే మీడియా పెద్ద‌ల్లారా జాగ్ర‌త్త ప‌డండి.


Related News

Vemuri-RadhakrishnaABN RK

వైసీపీ కేసులో ఆంధ్ర‌జ్యోతి ఎండీకి ఊర‌ట‌

Spread the loveవైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి చుక్కెదుర‌య్యింది. ఆంధ్ర‌జ్యోతి మీద వేసిన ప‌రువు న‌ష్టం కేసులో సుప్రీం కోర్ట్Read More

13e54fae-9c26-4ae9-8087-a8c410aa0371

సాక్షి చెమటోడ్చింది..

Spread the loveదేశాన్ని ముంచి దర్జాగా విదేశాలకు పారిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతRead More

  • ఆంధ్రజ్యోతి అవస్థలు అన్నీఇన్నీ కావు…
  • జగన్ పరువు తీస్తున్నారు..
  • కోమటి రెడ్డి రాజ్.. క్లోజ్?!
  • టీవీ9 రాజేస్తే ..ఏబీఎన్ పరిష్కరించిందా?
  • యూట్యూబ్ రూల్స్ మార్చేసింది…
  • అమరావతి ఆశలు నీరుగార్చేసిన చానెల్
  • ‘కత్తి’ చుట్టూ మీడియా: కథ నడిపిందెవరు?
  • గజల్స్ గలీజు వెనుక మీడియా చానెల్స్ యజమాని
  • Comments are Closed